Eenadu Eetaram (14/04/2012)
ఏమిటీ ప్రత్యేకతలు? ఆన్‌లైన్ రేడియో ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటున్న ట్రెండ్. తెలుగులో మాత్రం రేడియో జోష్‌తోనే ఈ ధోరణి మొదలైంది. రేడియో జోష్‌కి హైదరాబాద్‌తో పాటు ఇంగ్లండ్, అమెరికా, ఆస్ట్రేలియాల్లోనూ కార్యాలయాలున్నాయి. ఈ వెబ్‌సైట్‌ని ఇప్పటికి దాదాపు నూట యాభై దేశాల్లోని జనం వీక్షించారు.www.radiojosh.com వెబ్‌సైట్‌లో ఒక్కసారి లాగిన్ అయితే చాలు ఏ దేశంలో ఉన్నా ఉచితంగా ఆడియో, వీడియో కాల్‌తో ఆర్జేలతో మాట్లాడొచ్చు. దీంతోపాటు నేరుగా ల్యాండ్‌లైన్‌కే ఫోన్ చేసి నచ్చిన పాట అడగొచ్చు. ఐఫోన్, అండ్రాయిడ్ ఆప్స్‌తో రేడియో వింటూ చాటింగ్ చేసుకునే అవకాశముంది. దీనికోసం ప్రత్యేకంగా 'షౌట్ బాక్స్' అనే ఆప్షన్ ఉంటుంది. ఇరవై నాలుగు గంటల రేడియో జోష్ కార్యక్రమాలు తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లోనూ కొనసాగుతున్నాయి. ఈ ఆన్‌లైన్ రేడియో మొదలైన ఆరు నెలల్లోనే వెబ్‌సైట్‌ని నాలుగు లక్షలమంది క్లిక్‌మనిపించారు. ఇందులో ఎక్కువమంది కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, గృహిణలే. భవిష్యత్తు ఆన్‌లైన్‌దే ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి గనకే భవిష్యత్తంతా 'ఆన్‌లైన్ రేడియోలదే' అంటున్నాడు రేడియో జోష్ వ్యవస్థాపకుడు అగ్నిపుత్రవర్మ ఉరఫ్ ఉద్ధవోలు సాయికుమార్. వర్మ ఈ అంతర్జాల రేడియో కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. రెండునెలలు కష్టపడి తనే సొంతంగా కొత్తవాళ్లకి శిక్షణనిచ్చి ఆర్జేలుగా తయారు చేశాడు. పాటల సేకరణ.. సెలెబ్రెటీల అపాయింట్‌మెంట్.. మార్కెటింగ్.. అన్నింటికీ వన్‌మ్యాన్ ఆర్మీలా కష్టపడ్డాడు. 'ఇప్పుడు రేడియో జోష్‌కి వస్తున్న స్పందనతో పడ్డ కష్టమంతా తేలిగ్గా మర్చిపోతున్నా' అంటున్నాడు. వర్మ జోష్ కేవలం రేడియో జోష్‌తోనే ఆగిపోలేదు. సినిమాలకి వెబ్‌సైట్లు తయారు చేసి ఇస్తున్నాడు. బిజినెస్‌మేన్ సినిమాతో మొదలుపెట్టి రాజన్న, పంజా, దమ్ము, ఈగ, దరువు సినిమాల అఫీషియల్ వెబ్‌సైట్లు రూపొందించాడు. మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తూ తన ఆన్‌లైన్ రేడియో ద్వారా సినిమాలకి విదేశాల్లో ప్రచారం కల్పిస్తున్నాడు. ఇంతేనా? రేడియో జోష్ ప్రవాసాంధ్రులను కలిపే సరికొత్త వేదిక. అమెరికా, ఇంగ్లండ్, దుబాయ్, ఆస్ట్రేలియాల్లోని తెలుగు సంఘాలు ఏ కార్యక్రమం తలపెట్టినా వర్మ రేడియో జోష్ ప్రచార వేదికగా ఉపయోగపడుతోంది.
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి