ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు
అమెరికాయానానికి 'ఈనాడు' తోడు
ఉ న్నత విద్య.. మెరుగైన ఉపాధి అవకాశాలు.. బంధువులను కలవడం.. పర్యాటకం.. ఇలా అనేక అవసరాల నిమిత్తం రాష్ట్రం నుంచి చాలా మంది అమెరికా వెళ్తుంటారు. ఇందుకు వీసా సమకూర్చుకోవడమనేది మహా క్రతువు. దరఖాస్తు చేయడం మొదలు వీసా చేతిలో పడే వరకు ఎన్నో సందేహాలు, మరెన్నో సమస్యలు. ఇవన్నీ పరిష్కారం కావాలంటే అసలు ఎవరిని సంప్రదించాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి. ఈ నేపథ్యంలో 'ఈనాడు' మీకు తోడుగా నిలుస్తుంది. వీసాలకు సంబంధించిన సందేహాల నివృత్తి, సమస్యల పరిష్కారంతోపాటు తగిన సూచనలు ఇచ్చేందుకు అమెరికా కాన్సుల్ జనరల్ కెథరీనా ధనాని సంసిద్ధత వ్యక్తంచేశారు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా... మీ సందేహాలు, సమస్యలను స్పష్టంగా చెబుతూ మాకు ఈమెయిల్ చేయాలి. లేదా, ఉత్తరం రాయాలి. కేవలం అమెరికా వీసాలకు సంబంధించిన అంశాలను మాత్రమే అనుమతిస్తారు. లేఖలు పంపాల్సిన చిరునామా: ఈనాడు కార్యాలయం, 7-134/1, గూడ్స్‌షెడ్ రోడ్డు, మూసాపేట, హైదరాబాద్- 500018. ఈమెయిల్ చిరునామా: usvisa@eenadu.net
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి