Find your Gadget easy (Eenadu Thursday 05/04/2012)
ల్యాప్‌టాప్... సెల్‌ఫోన్... ట్యాబ్లెట్... మ్యాక్... నోట్‌బుక్... ఐపాడ్... వాడే పరికరం ఏదైనా... పొరబాటున పోగొట్టుకుంటే! ఎవరైనా దొంగిలిస్తే! ఎక్కడుందో ఇట్టే పట్టేయవచ్చు! అందుకు మార్గాలు చాలానే ఉన్నాయి!!వేలకు వేలు పోసి కొనే ల్యాపీ, మొబైల్, ఐప్యాడ్ లాంటి గ్యాడ్జెట్‌లు చేజారిపోతే? వాటి ఖరీదే కాదు, వాటిలో దాచుకునే సమాచారం అంతకన్నా విలువైనది. మరి వాటికి నీళ్లు వదులుకోవలసిందేనా? అక్కర్లేదు! అవి ఎక్కడ ఉన్నాయో చిటికెలో కనిపెట్టవచ్చు. మీరే ఎక్కడైనా మర్చిపోయినా, లేక ఎవరైనా చేతివాటం చూపించినా బెంగపడకుండా ఒకే ఒక్క క్లిక్కుతో, ఒకే ఒక్క మెసేజ్‌తో వాటి జాడ పట్టుకోవచ్చు. అవి ఎక్కడున్నాయో, ఎవరు వాడుతున్నారో తెలుసుకోవచ్చు. ఇదేదో ఖర్చుతో కూడుకున్నది అనుకునేరు, పూర్తిగా ఉచితం! కొన్ని టూల్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి!ముందుగా మొబైల్ చేజారిన మొబైల్ ఉనికిని కనుగొనడానికి అనువైన మార్గంAvast Mobile Security. ఇది ఆండ్రాయిడ్ మొబైళ్లకు ప్రత్యేకం.Anti-Theft Security సౌకర్యంతో ఎక్కడుందో తెలిసిపోతుంది. ఎనేబుల్ చేయగానే 'ఇన్‌విజిబుల్'గా అప్లికేషన్ పని చేస్తుంది. దొంగిలించిన వ్యక్తి దీన్ని డిసేబుల్ చేయడం అసాధ్యం. ఒకే ఒక్క ఎసెమ్మెస్ కమాండ్‌తో ఫోన్ హిస్టరీని తుడిచేసి లాక్ చేయవచ్చు. పెద్ద శబ్దంతో సైరన్ యాక్టివేట్ చేసే వీలుంది. పీజీఎస్ సర్వీసుతో ట్రాక్ చేయవచ్చు. http://goo.gl/SbNKt * ఇలాంటిదే మరోటి AntiDroidTheft. జీపీఎస్ సర్వీసుతో మొబైల్‌ని ట్రాక్ చేస్తుంది. మొబైల్ కెమెరాని యాక్టివేట్ చేసి ఫొటోలు తీసి పంపుతుంది. http://goo.gl/om38Y * దొంగిలించిన వ్యక్తి, ఇతరులెవరైనా సిమ్‌కార్డ్‌ని మార్చేసి వాడుకోవడానికి ప్రయత్నిస్తే SIM Watcher Pro ఇట్టే చెప్పేస్తుంది. మార్చిన సిమ్ నెంబర్‌ని మీరు ఎంచుకున్న మొబైల్ నెంబర్‌కి ఆటోమాటిక్‌గా మెసేజ్ చేస్తుంది.http://goo.gl/k3iVu * అన్ని విధాలుగా మొబైల్‌కి సెక్యూరిటీ వలయాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే Lookout Security & AntiVirusపొందండి. జీపీఎస్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ గూగుల్ మ్యాపింగ్‌తో మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు.http://goo.gl/hnDd0 * విండోస్ మొబైల్ వాడుతున్నట్లయితే సెట్టింగ్స్‌లోని Find My Phone-> Save my Location Every few hours చెక్ చేసి మొబైల్‌ని ట్రాక్ చేయవచ్చు. అందుకు www.windowsphone.comలోకి లాగిన్ అయ్యి My phone-> Find My Phoneలోకి మ్యాప్‌పై లొకేషన్‌ను చూడొచ్చు. పాస్‌వర్డ్‌తో ఫోన్ లాక్ చేసే వీలుంది. * బ్లాక్‌బెర్రీ వాడుతున్నట్లయితే BlackBerry Protectను వాడండి. లొకేషన్‌ని తెలుసుకోవడమే కాకుండా డేటా మొత్తాన్ని క్లౌడ్ స్టోరేజ్‌లో బ్యాక్‌అప్ చేసుకునే వీలుంది.http://m.blackberry.com/protect/ మీ ల్యాపీ సురక్షితం! ల్యాప్‌టాప్‌ను ఎవరైనా దొంగిలిస్తే దాని ఉనికిని కనిపెట్టడానికి LocateMyLaptop గురించి తెలుసుకోవావల్సిందే. ఇదో ఉచిత సర్వీసు. దీంట్లో సభ్యులై అప్లికేషన్ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలు. కనిపించకుండానే 'ఇన్‌విజిబుల్' మోడ్‌లో ల్యాపీలో చేరి కాచుకుంటుంది. గూగుల్ మ్యాపింగ్ ద్వారా ల్యాపీని ఎక్కడెక్కడికి తీసుకెళ్లారో కూడా చూడొచ్చు. ట్రయల్ వెర్షన్‌లో 15 రోజుల పాటు అన్ని సర్వీసుల్ని పూర్తిస్థాయిలో వాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఎలర్ట్ మెసేజ్‌లను పంపుతుంది. మానిటరింగ్ సెంటర్ నుంచి ల్యాపీ, నెట్‌బుక్, నోట్‌బుక్ ఉన్న ప్రాంతాన్ని మార్కింగ్‌తో చూడొచ్చు. అందులోని సమాచారాన్ని రిమోట్ యాక్సెస్‌తో రికవర్ చేయవచ్చు. ముఖ్యమైన సమాచారాన్ని డిలీట్ చేయవచ్చు. http://locatemyla ptop.com * బ్రౌజర్ యాడ్‌ఆన్‌తోనే ల్యాపీ లొకేషన్‌ని తెలుసుకోవాలంటే http://loki.comలోకి వెళ్లండి. FindMeట్యాబ్‌లోకి వెళ్లి లొకేషన్‌ని సెట్ చేసుకోవచ్చు. * ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ నుంచి మొట్టమొదటిగా అందుబాటులోకి వచ్చిన ట్రాకింగ్ టూల్ Adeona. లినక్స్, మ్యాక్, విండోస్ ఎక్స్‌పీ, విస్టాల్లో వాడుకోవచ్చు.http://goo.gl/BEpDE ట్యాబ్లెట్ ఎక్కడున్నది? అరచేతిలో ల్యాపీలా మారిపోయిన ట్యాబ్లెట్‌ను ట్రాకింగ్ చేసి పట్టుకోవాలంటే Prey Anti-Theft టూల్‌ని నిక్షిప్తం చేసుకోండి. ఆండ్రాయిడ్ ఓఎస్ ట్యాబ్లెట్‌లకి ఇది ప్రత్యేకం. జీపీఎస్, వై-ఫై నెట్‌వర్క్‌ల సాయంతో ఉనికిని తెలుసుకోవచ్చు. పనిచేయకుండా లాక్ చేయవచ్చు కూడా. సిమ్‌కార్డ్‌ని మార్చేసి వాడేందుకు ప్రయత్నిస్తే మెసేజ్ అందుతుంది. http://goo.gl/4wmhj * ఇలాంటిదే మరోటి Anti-Theft Plug In. ప్రముఖ సెక్యూరిటీ సంస్థ Norton దీన్ని ఉచితంగా అందిస్తోంది. దీన్ని నిక్షిప్తం చేసి Lock, Locate, Find సదుపాయాల్ని వాడుకోవచ్చు. 'రిమోట్ లాక్‌డౌన్'తో పోయిన ట్యాబ్లెట్‌ని ఇతరులు వాడకుండా చేయవచ్చు. http://goo.gl/MDOQU మ్యాక్.. ఐఫోన్.. ఐపాడ్ OS X Lion ఓఎస్‌తో మ్యాక్ ఉత్పత్తుల్ని వాడుతుంటే 'ఐక్లౌడ్'ని ఇన్‌స్టాల్ చేయాల్సిందే. అనుకోకుండా మ్యాక్‌ని ఎవరైనా దొంగిలిస్తే Find my Mac సర్వీసెస్‌ని ఎనేబుల్ చేసి అదెక్కడుందో కనుక్కోవచ్చు. అందుకు 'యాపిల్ ఐడీ'తో సైట్‌లోకి లాగిన్ అవ్వాలి. నోటిఫికేషన్ మెసేజ్ పంపొచ్చు. అలాగే, Remote Lock మ్యాక్‌కి తాళం వేయవచ్చు. డ్రైవ్‌ల్లోని డేటాని తొలగించొచ్చు. * Find My iPhoneతో ఐఫోన్‌ని కూడా ట్రాక్ చేసే వీలుంది. ఇదే మాదిరిగా ఐపాడ్‌లను కనిపెట్టొచ్చు. సైట్‌లో సభ్యులయ్యాక ఐడీతో యాపిల్ ఉత్పత్తుల్లో మీరు వాడుతున్నవాటిని ఎంపిక చేసుకోవాలి. ప్రక్రియ మొత్తానికి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. www.icloud.com మరికొన్ని... * ట్యాబ్లెట్, ఫోన్, మొబైల్... వాడుతున్నది ఏదైనా RestSafeటూల్‌తో ట్రాకింగ్ చేయవచ్చు. ఓపెన్‌సోర్స్ కమ్యూనిటీ దీన్ని రూపొందించారు. జీపీఎస్, వై-ఫై హాట్‌స్పాట్స్‌తో లొకేషన్‌ని ట్రాక్ చేయవచ్చు. ల్యాపీ వెబ్ కెమెరాని ఆటోమాటిక్‌గా ఆన్ ఆయ్యేలా చేసి దొంగిలించిన వ్యక్తి ఫొటోలు తీయవచ్చు. అందుబాటులో ఉన్న వై-ఫై హాట్‌స్పాట్స్‌ని ఎనేబుల్ చేసి నెట్‌కి అనుసంధానం అయ్యేలా చేయడం దీని ప్రత్యేకత. http://preproject.com * ల్యాపీ, మొబైల్స్‌ని ట్రాక్ చేసే మరో వెబ్ సర్వీసుwww.lockittight.com సాఫ్ట్‌వేర్‌ని నిక్షిప్తం చేసి, సైట్‌లో సభ్యులైతే లొకేషన్ ట్రాకింగ్ రిపోర్ట్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేయవచ్చు. 'స్క్రీన్‌షాట్స్'తో ల్యాపీలో ఏమేం చేస్తున్నారో తెలుసుకునే వీలుంది. వెబ్ కెమెరాతో దొంగిలించిన వ్యక్తి ఫొటోలు పొందొచ్చు. 'కీ లాగింగ్'తో ఏయే అప్లికేషన్స్ వాడుతున్నారో కూడా చూడొచ్చు |
I know this site presents quality based posts and extra stuff, is there any other web site which gives these things in quality?
రిప్లయితొలగించండి