Eenadu Salads_2


తందూరి చికెన్‌, మెలన్‌ సలాడ్‌
కావల్సినవి:తయారైన తందూరి చికెన్‌ - వంద గ్రా, పుదీనా చట్నీ - పదిహేను గ్రా, రెడ్‌క్యాబేజీ తరుగు - పది గ్రా, లెట్యూస్‌ ఆకులు - ఇరవై గ్రా, పుచ్చకాయ, తర్బూజా ముక్కలు - ఇరవైఅయిదు గ్రా చొప్పున.తయారీ: చికెన్‌ను ముక్కల్లా తరిగి పుదీనా చట్నీ కలపాలి. ఓ పళ్లెం తీసుకుని లెట్యూస్‌ ఆకును పరవాలి. దానిపై రెడ్‌ క్యాబేజీ తరుగు సర్దాలి. ఇప్పుడు మరో లెట్యూస్‌ ఆకును ఉంచి.. చికెన్‌ ముక్కలు.. దానిపై పుచ్చకాయ, తర్బూజా ముక్కల్ని సర్దాలి. పైన పుదీనా ఆకు అలంకరిస్తే.. నోరూరించే చికెన్‌, మెలన్‌ సలాడ్‌ సిద్ధమైనట్లే.

గ్రీక్‌ సలాడ్‌
కావల్సినవి: కీరదోస - మూడు (కాస్త పెద్ద ముక్కల్లా తరగాలి), ఫెటా చీజ్‌ ముక్కలు - ఒకటిన్నర కప్పు, నల్ల ఆలివ్‌లు - కప్పు, హైబ్రిడ్‌ టమాటా ముక్కలు - మూడుకప్పులు, ఎర్ర ఉల్లిపాయ - సగం (చక్రాల్లా కోయాలి), సన్‌డ్రైడ్‌ టమాటా ముక్కలు - పావుకప్పు కన్నా తక్కువ. తయారీ: వెడల్పాటి సలాడ్‌ పాత్ర తీసుకుని అందులో పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. తినే ముందు వరకు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు.. చలచల్లని గ్రీక్‌ సలాడ్‌ రుచే వేరు.





ఆరోగ్యం...ఉత్సాహం...మీ చెంతే!
సాగో ఇడ్లీ
కావలసినవి
సగ్గుబియ్యం: 2కప్పులు, పుల్లని మజ్జిగ: 2 కప్పులు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: 4, ఉప్పు: 2టీస్పూన్లు, ఆవాలు: అరటీస్పూను, మినప్పప్పు: అర టీస్పూను, సెనగపప్పు: అర టీస్పూను, కరివేపాకు: కట్ట, కొత్తిమీర: కట్ట, ఇంగువ: చిటికెడు(ఇష్టమైతేనే), నూనె: 2టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
సగ్గుబియ్యాన్ని పుల్లనిమజ్జిగలో కనీసం ఐదారుగంటలు నానబెట్టాలి. (మజ్జిగ మరీ పలుచగా మరీ చిక్కగా కాకుండా మధ్యస్థంగా ఉండాలి)
ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుల్ని సన్నగా తరగాలి.
స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి కాయాలి. ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు వేసి తాలింపులా వేయించాలి. తరవాత ఇందులోనే నానబెట్టిన సగ్గుబియ్యం పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. కొత్తిమీర సన్నగా తరిగి ఈ మిశ్రమంలో కలపాలి.
ఈ సగ్గుబియ్యం పిండిని ఇడ్లీ రేకుల్లో ఇడ్లీల మాదిరిగా వేసి 15-20 నిమిషాలు ఉడికించాలి.
మెత్తగా ఉండే సగ్గుబియ్యం ఇడ్లీలను టొమాటో చట్నీతో కలిపి తింటే బాగుంటాయి.
మసాలా రోటి
కావలసినవి
గోధుమపిండి: కప్పు, ఓట్‌మీల్‌(ఓట్లపిండి): కప్పు, సెనగపిండి: కప్పు, ఉప్పు: అరటీస్పూను, జీలకర్ర పొడి: అరటీస్పూను, మెంతిపొడి: అరటీస్పూను, గోరువెచ్చని నీళ్లు: సరిపడా, నెయ్యి: తగినంత
తయారుచేసే విధానం
పిండిలన్నింటినీ కలిపి అందులో ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి కూడా వేసి బాగా కలపాలి. పిండిని బాగా మర్దించి చపాతీలా చేసి పెనం మీద నూనె/నెయ్యి వెయ్యకుండా కాల్చాలి. చివరలో రొట్టెమీద కొద్దిగా కరిగించిన నెయ్యి రాసి, పచ్చి కూరగాయముక్కలతో కలిపి రాత్రి భోజనంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
స్ప్రౌట్స్‌ అండ్‌ ఫ్రూట్‌ భేల్‌
కావలసినవి
లావుగా ఉండే మరమరాలు: కప్పు, జీలకర్ర: అరటీస్పూను, ఇంగువ: చిటికెడు, పసుపు: పావుటీస్పూను, నల్లఉప్పు: పావుటీస్పూను, నూనె: అరటీస్పూను, వేరుసెనగపప్పు: 4 టేబుల్‌స్పూన్లు(ఉడికించినవి), వెులకెత్తిన పెసలు: 4 టేబుల్‌స్పూన్లు, టొమాటో ముక్కలు(సన్నగా తరిగినవి): 4 టేబుల్‌స్పూన్లు, యాపిల్‌ముక్కలు: 4 టేబుల్‌స్పూన్లు, పచ్చిమామిడికాయ ముక్కలు: 2 టేబుల్‌స్పూన్లు, తాజా దానిమ్మగింజలు: 4 టేబుల్‌స్పూన్లు, కమలాతొనలు: అరకప్పు, కొత్తిమీర తురుము: 4 టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం: 4 టీస్పూన్లు, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ఓ బాణలిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర వేయించాలి. తరవాత ఇంగువ, పసుపు, మరమరాలు వేసి బాగా కలపాలి. నల్లఉప్పు కూడా బాగా కలిపి చల్లారనివ్వాలి. (ఇలా చేసి ఉంచిన మరమరాల్ని గాలి చొరని డబ్బాలో పెట్టుకుని కావాలనుకున్నప్పుడల్లా తీసి వాడుకోవచ్చు) ఈ మరమరాల్లో వేరుసెనగపప్పు, పెసలు, దానిమ్మ గింజలు, కమలా పండ్ల తొనలు... అన్నీ కలిపితే ఫ్రూట్‌బేల్‌ తయార్‌!
గోధుమ సలాడ్‌
కావలసినవి
ముడిగోధుమలు: కప్పు, బ్రెడ్‌ ముక్కలు: ఒకటిన్నరకప్పు, వెులకెత్తిన పెసలు: కప్పు, పాలకూర: కట్ట, ఉల్లిపాయ: ఒకటి(సన్నగా కోయాలి), నిమ్మరసం: 4 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
గోధుమల్ని ముందురోజే తడిబట్టలో మూటగట్టి వెులకలు రానివ్వాలి.
పాలకూరను కడిగి సన్నగా తరగాలి.
తాజా బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
ఉల్లిపాయని కూడా సన్న ముక్కలుగా కోసి వెులకల్లో కలపాలి. అందులోనే పాలకూర, బ్రెడ్‌ ముక్కలు, నిమ్మరసం కలిపితే గోధుమ సలాడ్‌ రెడీ!



చల్లచల్లగా...
ఈ శుక్రవారమే శివరాత్రి. ఉపవాసం ఉంటున్నారా?
నీరసం రాకుండా ఇవి తీసుకోండి మరి...
ఫ్రూట్‌లూప్‌
కావలసినవి: నల్లద్రాక్ష: 100గ్రా||, కివీ పండ్లు: రెండు, పేషన్‌ఫ్రూట్‌: రెండు, పైనాపిల్‌ ముక్కలు: నాలుగు, పంచదార: సరిపడా (పంచదార ఇష్టం లేకపోతే 2 టేబుల్‌స్పూన్ల తేనె కలుపుకోవచ్చు.)
తయారుచేసే విధానం:
* కివీ పండ్ల తొక్క తీయాలి. పేషన్‌ఫ్రూట్‌ రసం విడిగా పిండాలి.
* ద్రాక్ష, కివీ పండ్లు, పేషన్‌ ఫ్రూట్‌ రసం, పైనాపిల్‌ ముక్కలు, పంచదార లేదా తేనె, తగినన్ని నీళ్లు... అన్నీ కలిపి ఫ్రూట్‌ బ్లెండర్‌లో వేసి జ్యూస్‌ చేసి గ్లాసుల్లోకి వంపి ఐసుముక్కలు కలిపి అందించండి. కివీ పండ్లకు బదులుగా సపోటా కూడా వేయవచ్చు.
మెలన్‌ జ్యూస్‌
కావలసినవి: పుచ్చకాయ: అరకిలో, కమలాలు: 2, తేనె: 4 టీస్పూన్లు, నిమ్మరసం: అరటీస్పూను, అల్లంముక్క: అరంగుళం
తయారుచేసే విధానం
* పుచ్చకాయ ముక్కలు కోసి చెక్కు తీసేయాలి. గింజలు కూడా ఏరివేయాలి.
* కమలాతొనల నుంచి రసం పిండుకోవాలి.
* పుచ్చముక్కలు, కమలారసం, అల్లంముక్క... జ్యూసర్‌లో వేసి తిప్పాలి. చివరలో తేనె, నిమ్మరసం కలపాలి. (తీపి చాలదనుకుంటే కాస్త చక్కెర వేసుకోవచ్చు. లేదంటే మరో రెండు టీస్పూన్లు తేనె కలుపుకుంటే సరి)
యాపిల్‌ షేక్‌
కావలసినవి: గ్రీన్‌ యాపిల్‌: ఒకటి, కీరాదోస: అరకాయ, తెల్లద్రాక్ష: గుప్పెడు, పంచదార లేదా తేనె: సరిపడా
తయారుచేసే విధానం:
* గ్రీన్‌ యాపిల్‌ను కడిగి ముక్కలుగా కోయాలి.
* కీరా దోసకాయను తొక్కు తీసి ముక్కలుగా చేయాలి.
* గ్రీన్‌ యాపిల్‌, కీరా దోస ముక్కలు, కడిగిన ద్రాక్షపండ్లు, పంచదార... అన్నీ కలిపి జ్యూసర్‌లో వేసి మెత్తగా అయ్యాక తగినన్ని చల్లనినీళ్లు కలిపి ఓసారి తిప్పి గ్లాసుల్లోకి వంపండి.
బొప్పాయి సలాడ్‌
కావలసినవి: బొప్పాయి: చిన్నది(పావుకిలో), బత్తాయి రసం: అరకప్పు, టొమాటోలు: నాలుగు, నువ్వులు: 2 టీస్పూన్లు
వినెగర్‌: టీస్పూను, నిమ్మరసం: 3 టీస్పూన్లు, మిరియాలపొడి: టీస్పూను, వెల్లుల్లి రేకలు: 4(ఇష్టమైతేనే), ఉప్పు: చిటికెడు
తయారుచేసే విధానం:
బొప్పాయి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. టొమాటోలు కూడా ముక్కలు కోయాలి. వెడల్పాటి గాజు బౌల్‌లో ఈ ముక్కల్ని వేసి కలపాలి. ఇందులో బత్తాయిరసం, నిమ్మరసం, మిరియాలపొడి, వినెగర్‌, వెల్లుల్లి, ఉప్పు వేసి కలపాలి.
ఆరెంజ్‌ స్పైస్‌
కావలసినవి: అరటిపండు: ఒకటి, కమలాలు: రెండు, అల్లం: అరంగుళం ముక్క(తాజాది), సోయాపాలు: 100మి.లీ., ఐసుక్యూబులు: 4, పంచదార: తగినంత
తయారుచేసే విధానం:
* అరటిపండు తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
* కమలాతొనల రసం పిండాలి.
* అరటిపండుముక్కలు, సోయాపాలు, అల్లంముక్కలు, పంచదార, కమలారసం... అన్నీ కలిపి జ్యూసర్‌లో వేసి తిప్పితే, ఆరెంజ్‌ సైశ్పస్‌ రెడీ!




ఫ్రెంచ్‌ రైస్‌ సలాడ్‌
కావలసినవి
బాస్మతి బియ్యం: 2 కప్పులు, సెలెరీ తురుము: అరకప్పు, టొమాటో ముక్కలు: కప్పు, ఉల్లికాడల తురుము: కప్పు, కప్పు, వేరుసెనగపప్పు: కప్పు, గుమ్మడిగింజలు: కప్పు, ఉప్పు: తగినంత, మిరియాలపొడి: 2 టీస్పూన్లు, ఫ్రెంచ్‌ బీన్స్‌: పావుకప్పు, వెులకల ఆవాలు: 2 టీస్పూన్లుతయారుచేసే విధానం
బాస్మతిబియ్యం కడిగి ఉడికించి పక్కన ఉంచాలి.
జీడిపప్పు, వేరుసెనగపప్పు, గుమ్మడిగింజలు విడివిడిగా నూనె లేకుండా వేయించి తీయాలి.
ఇప్పుడు కూరగాయలముక్కలన్నీ విడివిడిగా కొద్దిసేపు వేయించి తీయాలి.
తరవాత వీటిని అన్నంలో కలపాలి. తరవాత సన్నగా తరిగిన ఫ్రెంచ్‌బీన్స్‌ ముక్కలు, ఆవ వెులకలు వేసి కలపాలి.
చివరగా వేయించిన నట్స్‌కూడా వేసి తగినంత ఉప్పు, మిరియాలపొడి చల్లి దించాలి.





కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు