కోరుకుంటే తాజా కొబ్బరి * క్యాబేజీ, దొండ, బీన్స్ వంటి కూరల్లో తాజా కొబ్బరి వేస్తే.. చాలా రుచిగా అనిపిస్తుంది. అయితే ఒక్కోసారి అది అందుబాటులో ఉండదు. అలాంటప్పుడు ఎండుకొబ్బరి వాడుతుంటే.. ఆ రుచి రావడంలేదు. ఏం చేయమంటారు?
-రాజేశ్వరి
ఎండుకొబ్బరిని తురిమి ఓ కప్పులోకి తీసుకోండి. గోరువెచ్చని పాలు, నీళ్లు సమపాళ్లలో తీసుకుని కొబ్బరితురుముకి కలపండి. అరగంటయ్యాక ఈ మిశ్రమాన్ని తీసుకుని మిక్సీలో వేయండి. కూరల్లోకి తాజా కొబ్బరి సిద్ధమైనట్లే.* నేను ఫ్రూట్‌సలాడ్ ఎక్కువగా చేస్తుంటాను. దాని తయారీలో అరటిపండ్లు కూడా వాడుతుంటా. కాసేపటికి ఫ్రూట్ సలాడ్ మరీ చిక్కగా అయిపోతుంది. జిగటగా తయారవుతోంది. ఇలా ఎందుకు. సలహా ఇవ్వండి?
-కల్యాణి
మరీ పండిన అరటిపండ్లు వాడినప్పుడే ఇలా అవుతుంది. అలాగే.. మంచి సువాసనతో పాటు రుచి రావడానికి ఫ్రూట్‌సలాడ్‌లో యాలకులపొడి వేసినా కూడా అరటిపండ్లు కాసేపటికి జిగటగా మారిపోతాయి. అందుకే.. ముందు పండ్లముక్కలు, పంచదార కలపండి. వడ్డించేందుకు రెండు నిమిషాల ముందు యాలకులపొడి చల్లండి సరిపోతుంది. అలాగే దోరగా ఉన్న అరటిపండ్లను ఎంచుకోండి.* మా ఇంట్లో అందరికీ బెండకాయ వేపుడంటే చాలా ఇష్టం. అయితే జిగురు వల్ల అనుకున్న రుచిలో రావడంలేదు. కడిగి ఆరబెట్టి వేయించినా.. వండుతున్నప్పుడు మజ్జిగ చల్లినా కూడా జిగురుగానే వస్తోంది. ఏం చేయమంటారు.
- ఓ సోదరి
బెండకాయల్ని కడిగి ఆరబెట్టడం అంటే.. వాటిపై ఉన్న తడి పూర్తిగా పోవాలి. లేదంటే.. వేపుడు జిగురుగానే వస్తుంది. దీనికో పరిష్కారం ఉంది. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి.. పొడి వస్త్రంతో తుడిచి తరగండి. వాటిపై కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, పసుపు చల్లి ఆ తరవాత వేయించండి. జిగురు సమస్య ఉండదు.
ఉపవాసమా...ఇవికాస్త తీసుకోండి..! రోజ్ పానీకావలసినవి గులాబీ రేకులు: 12 పువ్వులు, చల్లటినీరు: లీటరు, పంచదార పొడి: 15 టీస్పూన్లు, నిమ్మకాయ: అరచెక్క, యాలకుల పొడి: పావుటీస్పూను తయారుచేసే విధానం * మిక్సీ జార్‌లో గులాబీ రేకులు వేసి పంచదార పొడి, యాలకులపొడి, నిమ్మరసం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీన్ని లీటరు నీటిలో కలపాలి. * కొత్త కుండకు తడిబట్ట చుట్టి గులాబీ మిశ్రమం కలిపిన నీటిని అందులో పోసి మూత పెట్టాలి. మూడు గంటలపాటు కుండను తడుపుతూ ఉండాలి. * తియ్యగా కొద్దిగా పుల్లగా కాస్త వగరుగా అనిపించే ఈ రోజ్‌పానీని మధ్యాహ్నం 3-4 గంటల మధ్యలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా ఎండ తాపాన్ని తగ్గించి ఉల్లాసాన్నిస్తుంది.
గోల్డెన్ రిఫ్రెషర్కావలసినవి మిల్క్‌మెయిడ్: 600 మి.లీ., బొప్పాయి: పావుకిలో, కమలాతొనలు: నాలుగు, తేనె: 4 టీస్పూన్లు తయారుచేసే విధానం * బొప్పాయి తొక్క తీసి ముక్కలుగా కోయాలి. కమలాతొనల్లోని గింజల్ని వేరు చేసి ముత్యాల్ని విడదీయాలి. బొప్పాయి ముక్కల్నీ కమలాతొనల్నీ మిక్సీలో వేసి గుజ్జుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుజ్జును పాలల్లో వేసి స్పూనుతో బాగా కలిపి తేనె కూడా కలిపి కాసేపు ఫ్రిజ్‌లిో పెట్టి చల్లచల్లగా తాగండి.
ఫ్రూట్ సలాడ్కావలసినవి పచ్చికొబ్బరి: చిప్ప (తురమాలి), అరటిపండ్లు: రెండు(సన్నగా చక్రాల్లా కోయాలి), జామకాయ: ఒకటి(పెద్దగా ముక్కల్లా కోయాలి), పంచదార: 2 టేబుల్‌స్పూన్లు, తేనె: 2 టేబుల్‌స్పూన్లు, ఎండు ఖర్జూరాలు: 100గ్రా||(సన్నగా కోయాలి) తయారుచేసే విధానం * కొబ్బరి తురుములో జామ, ఎండు ఖర్జూర, అరటిపండు ముక్కలు వేసి కలిపి చిన్న చిన్న బౌల్స్‌లోకి సర్దాలి. * పది నిమిషాల తరవాత చక్కగా ఊరి చాలా రుచిగా ఉండే ఈ సలాడ్‌ను నైవేద్యంగా కూడా పెట్టవచ్చు. వృద్ధులూ అనారోగ్యంతో బాధపడేవాళ్లూ కటిక ఉపవాసం చేయకుండా ఈ సలాడ్‌ను తిని గ్లాసుడు పాలు తాగితే మంచిది.
బనానా మిల్క్షేక్కావలసినవి అరటిపండ్లు: నాలుగు(చిన్న ముక్కలుగా చేయాలి), పాలు: లీటరు(మరిగించి చల్లార్చాలి), పంచదార: 4 టేబుల్‌స్పూన్లు, వెనీలా ఎసెన్స్: అరటీస్పూను, యాలకులపొడి: పావుటీస్పూను తయారుచేసే విధానం * మిక్సీ జ్యూస్ జార్‌లో అరటిపండ్ల ముక్కలు, పాలు, పంచదార, వెనీలా ఎసెన్స్, యాలకులపొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసి కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి గాజుగ్లాసుల్లో పోసి అందించాలి. (వెనీలా ఎసెన్స్ ఇష్టం లేనివారు తమకు నచ్చే ఫ్లేవర్‌లో మరేదైనా ఎసెన్స్‌ను వాడవచ్చు. ఎసెన్స్ అసలు వాడకుండానూ చేసుకోవచ్చు.) * పాలు - పండ్లు కలిపిన ఈ మిల్క్‌షేక్ తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది.
గరం గరం రాజ్‌మా చిజ్ టోస్ట్కావలసినవి రాజ్మా: 150గ్రా.,టొమాటోసాస్: ఒకటిన్నర కప్పులు, చిజ్: 50గ్రా., బ్రెడ్ స్త్లెసెస్: 10 తయారుచేసే విధానం * రాజ్‌మాను మెత్తగా ఉడికించి ఉంచాలి.బీ ఓ గిన్నెలో నూనె పోసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించాలి. తరవాత కొంచెం కారం, టొమాటో సాస్ కలపాలి.బీ ఇందులోనే ఉడికించిన రాజ్‌మాలను కూడా కలపాలి.బీ చిజ్‌ను కొబ్బరిలా తురమాలి.బీ రాజ్‌మా మిశ్రమాన్ని బ్రెడ్‌మీద వెుత్తం పరచుకునేలా పెట్టాలి. దీనిమీద చిజ్ తురుము చల్లి ఓవెన్‌లో గ్రిల్‌లో సుమారు ఓ పది నిమిషాలు అంటే చిజ్ కరిగి గింజల మిశ్రమానికి పట్టేవరకూ ఉంచి తీస్తే టోస్ట్ రెడీ. ఇది పిల్లలకు మంచి పోషకాహారం. రాజ్‌మాకు దులుగా పెసలు, లసందలు(వెులకలు వచ్చినవైనా) వేసుకుని కూడా చేసుకోవచ్చు.(ఉడికించిన రాజ్‌మా బేక్‌డ్ బీన్స్ రూపంలో సూపర్‌మార్కెట్లలో దొరుకుతున్నాయి. ఈ టిన్‌ను ఫ్రిజ్‌లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఇవయితే అప్పటికప్పుడు సునాయాసంగా టోస్ట్ చేసుకోవచ్చు.)
రెడ్ బీన్ కర్రీకావలసినవి రాజ్మా: 2 కప్పులు, ఉల్లిపాయలు: 2, టొమాటో: ఒకటి(పెద్దది), అల్లంవెల్లుల్లి: టీస్పూను, పచ్చిమిర్చి: మూడు, టొమాటోలు: మూడు, దనియాలపొడి: అరటీస్పూను, కారం: టీస్పూను, గరంమసాలా: అరటీస్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర: గుప్పెడుతయారుచేసే విధానం * రాజ్‌మాను రాత్రంతా నానబెట్టాలి. తరవాత బాగా కడిగి ప్రెషర్‌కుక్కర్‌లో ఉడికించాలి.బీ పాన్‌లో నూనె వేసి అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.బీ అవి వేగాక ఉల్లి, టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి.బీ ఉడికించిన రాజ్మా, కారం, దనియాలపొడి గరంమసాలా వేసి కలపాలి.బీ మంట తగ్గించి గ్రేవీ చిక్కబడేవరకూ ఉడికించి దించాలి. దించేముందు కొత్తిమీర చల్లాలి. ఇది చపాతీ, అన్నం రెండింటిలోకీ బాగుంటుంది.
దాల్మస్కాకావలసినవి రాజ్మా: 100గ్రా., మినుములు: 50గ్రా., టొమాటోసాస్: 4 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయలు: 100గ్రా., నూనె: 50గ్రా., అల్లం వెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు, కారం: టీస్పూను, పసుపు: చిటికెడు, గరంమసాలా: చిటికెడు, జీడిపప్పు: టేబుల్‌స్పూను, గసగసాలు: టేబుల్‌స్పూను, ఆరెంజ్‌కలర్: పావుటీస్పూను, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కట్ట, వెన్న: ఒకటిన్నర టేబుల్‌స్పూనుతయారుచేసే విధానం * ఎర్రని రాజ్‌మాలనీ మినుముల్నీ బాగా కడగాలి. ఈ రెండింటినీ కలిపి 3 గంటలు నానబెట్టాలి. తరవాత వీటిలో చిన్న అల్లంముక్క వేసి తగినంత ఉప్పువేసి కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి.బీ జీడిపప్పు, గసగసాలు కలిపి ముద్దగా నూరాలి.బీ బాణలిలో నూనె వేసి స్టవ్ మీద పెట్టాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. ఆ తరవాత అల్లంవెల్లుల్లి, కారం, పసుపు వేసి వేయించాలి. వేగిన తరవాత టొమాటో సాస్ వేసి కలిపితే ఎర్రని గ్రేవీ తయారవుతుంది.బీ ఇందులో ఉడికించిన రాజ్‌మా మినుములూ వేసి గరిటెతో బాగా కలపాలి. తరవాత గరంమసాలా, జీడిపప్పు ముద్ద వేసి కలిపి ఉప్పు రుచి చూసి దించాలి.
కిడ్నీబీన్ సలాడ్కావలసినవి రాజ్మా: కప్పు, వెల్లుల్లి: 4 రెబ్బలు, నూనె: ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు, టొమాటోలు(హైబ్రిడ్ రకానికి చెందినవి): 100గ్రా., క్యాబేజీ: 100గ్రా., పచ్చిమిర్చి: 2, ఉల్లిపాయలు: 50గ్రా., ఉప్పు: తగినంత, నిమ్మరసం: టీస్పూనుతయారుచేసే విధానం * రాజ్‌మాను 3 గంటలు నానబెట్టి కుక్కర్‌లో ఉడికించాలి.బీ టొమాటోలను 4 ముక్కలుగా కోయాలి.బీ క్యాబేజి, ఉల్లిపాయలు కూడా ఒకటిన్నర అంగుళాల సైజులో ముక్కలుగా కోసి పక్కనబెట్టాలి.బీ ఓ బాణలిలో నూనె పోసి వెల్లుల్లి ముక్కలు ఎర్రగా వేయించాలి. తరవాత కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా కలియబెట్టాలి. తరవాత ఉడికించిన రాజ్‌మా కూడా వేసి కలపాలి. తగినంత ఉప్పు, నిమ్మరసం కూడా కలిపి వేడిగా వడ్డించాలి.
రుచిగా సలాడ్లు.. రెస్టరంట్లలో భోజనానికి ముందు తీసుకునే సలాడ్లు చాలా రుచిగా ఉంటాయి. అదే పదార్థాన్ని ఇంట్లో ప్రయత్నిస్తే.. అనుకున్న రుచి రాదు కొన్నిసార్లు. చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. ఇంట్లోనూ సలాడ్లకు రెస్టరంట్ రుచి తేవడం సులువు. సలాడ్లను అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి తప్ప.. ఒకటిరెండు గంటల ముందు కాదు. లెట్యూస్ ఆకుల్ని కూడా ఆఖరున వేయాలి. అలాగే ఇంట్లో నిమ్మరసం, వెనిగర్, మిరియాల పొడి, ఆలివ్‌నూనె వంటి కొన్ని ప్రాథమిక పదార్థాలను అందుబాటులో ఉంచుకుంటే.. సలాడ్‌ను బట్టి డ్రెసింగ్‌ను చేసుకోవచ్చు. అయితే సలాడ్ మోతాదును బట్టి వీటిని వాడాలి. వీటన్నింటితోపాటు సరిపడా ఉప్పు, కొద్దిగా పంచదార జోడించడం తప్పనిసరి. ఇంకా రుచిగా ఉండాలంటే.. ఛాట్‌మసాలా, వెల్లుల్లి పలుకులు, తులసి ఆకులు, పుదీనా, స్వీట్‌కార్న్ లాంటివి కూడా వేసుకోవచ్చు.
- చెఫ్ నితిన్, తాజ్ కృష్ణా
|
|
|
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి