యూట్యూబ్‌ (Eenadu Thursday 29/03/2012)




యూట్యూబ్‌ అంటే... వీడియోల వినోదమే! మరి వాటిని ఉపయోగించుకోవడం తెలుసా? కొన్ని కిటుకులు తెలిస్తే ఎంత సులువో!
నెట్‌ ఓపెన్‌ చేసి యూట్యూబ్‌లోకి వెళితే టీవీ కార్యక్రమాల దగ్గర్నుంచి ఇంటర్య్వూలు, పాటలు, నవ్వించే దృశ్యాలు, అబ్బో... చాలా చూడవచ్చని తెలిసిందే. కానీ వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నా, సేవ్‌ చేసుకోవాలన్నా, ఫార్మట్‌ మార్చి పంచుకోవాలన్నా బోలెడు సందేహాలు. ఒకరికి తెలిసిన కిటుకులు మరొకరికి తెలియవు. ఇలాంటి విలువైన చిట్కాలు కొన్ని తెలుసుకుందాం!ఐడీ ఉంటే చాలు!
జీమెయిల్‌ వాడేవాళ్లంతా యూట్యూబ్‌ వీడియోల్లో కొత్తగా సభ్యులు కానక్కర్లేదు. లాగిన్‌ అయితే చాలు విభాగాల వారీగా వీడియోలు కనిపిస్తాయి. యూబ్యూబ్‌ వేదికపై ప్లే అవుతున్న వీడియో ఛానళ్లను బ్రౌజ్‌ చేయడానికి Browse Channels ఉంది. ఉదాహరణకు 'తెలుగువన్‌'లోని సినిమాలు, వీడియోల్ని చూడాలంటే TeluguOneలో సభ్యులవ్వొచ్చు. అలాగే టీవీ కార్యక్రమాలకు TV Showsఉంది. Moviesలో తెలుగు, హిందీ, తమిళం... ఇలా అన్ని భాషల సినిమాలు ఉన్నాయి. www.youtube.com/liveఎడ్యుకేషన్‌ వీడియోలకు www.youtube.com/educationఉంది. ప్రైమరీ, సెకండరీ, యూనివర్సిటీ విభాగాల్లో చదువుకు సంబంధించిన వీడియో పాఠాల్ని వీక్షించవచ్చు.
షేర్‌ చేయాలంటే?
మనం ఏ పుట్టినరోజుకో, పెళ్లికో తీసిన వీడియోలను షేర్‌ చేయాలంటే Upload ఉంది. Select files from your computerతో అప్‌లోడ్‌ చేయవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయాలంటే Ctrl కీని నొక్కి ఫైల్స్‌ని ఎంపిక చేసుకోవచ్చు. వెబ్‌ కెమెరాతో తీసినవాటిని నేరుగా అప్‌లోడ్‌ చేసుకునే వీలుంది. కానీ ఒక్కో హెచ్‌డీ ఫైల్‌ పరధి 15 నిమిషాలే. మరి అంతకంటే ఎక్కువ నిడివి ఉన్న వీడియో ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయాలంటే Increase your limitపై క్లిక్‌ చేయాలి. మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌తో రిజిస్టరైతేVerification Code మెసేజ్‌ వస్తుంది. దాని ద్వారా లాగిన్‌ అయ్యాక ఎంత పెద్ద ఫైల్స్‌ అయినా అప్‌లోడ్‌ చేసుకుని సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో పంచుకోవచ్చు.
వరుసగా ఎన్నైయినా!
యూట్యూబ్‌ నుంచి వీడియోని డౌన్‌లోడ్‌ చేయాలంటేYouTube Downloader ఉంది. రన్‌ చేస్తే YouTube URLబాక్స్‌లో విండో వస్తుంది. బాక్స్‌లో వీడియో యూఆర్‌ఎల్‌ లింక్‌ని పేస్ట్‌ చేయాలి. డౌన్‌లోడ్‌ చేయాలనుకునే వీడియోని ఏవీఐ ఫార్మెట్‌లో పొందాలనుకుంటే Formatమెనూలోని AVI ఎంపిక చేసుకోవచ్చు. ఇలాగే మరిన్ని ఫార్మెట్‌లు ఉన్నాయి. హైడెఫినెషన్‌లో కావాలనుకుంటేQuality మెనూలో Download క్లిక్‌ చేయాలి.http://youtubedownloader.com
మరింత సులభం
యూట్యూబ్‌ వీడియోలను అప్లికేషన్‌లోనే వెతుక్కుని డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే Umile Youtube Downloaderతో సాధ్యమే. అత్యంత వేగవంతమైన యూట్యూబ్‌ డౌన్‌లోడర్‌గా దీన్ని పిలుస్తున్నారు. మూడే క్లిక్కుల్లో ప్రక్రియ ముగిసిపోతుంది. ముందుగా 'సెర్చ్‌'పై క్లిక్‌ చేసి అప్లికేషన్‌లోనే యూట్యూబ్‌ వీడియోలను వెతకాలి. కావాల్సిన వీడియో యూఆర్‌ఎల్‌ లింక్‌ను అడ్రస్‌బార్‌లో పేస్ట్‌ చేయాలి. వీడియో క్వాలిటీని ఎంచుకుని 'డౌన్‌లోడ్‌'పై క్లిక్‌ చేయాలి. ఒకేసారి ఎనిమిది వీడియోలను డౌన్‌లోడ్‌ చేయవచ్చు. Automatic Conversionతో యాపిల్‌ ఐప్యాడ్‌, ఆండ్రాయిడ్‌ గెలాక్సీ, ఎంపీ3... ఫార్మెట్‌లోకి మార్చుకునే వీలుంది.http://youtube.umilefamily.com/en
అదే మార్చేస్తుంది
కావాల్సిన వీడియోని పొందడమే కాకుండా ఫార్మెట్‌ని ఎంపీ3లోకి మార్చాలనుకుంటే Youtube to mp3 ఉంది. యూట్యూబ్‌లో వీడియో పాటని ఎంపీ3 ఫైల్‌గా పొందాలంటే ఫైల్‌ యూఆర్‌ఎల్‌ను బాక్స్‌లోకి కాపీ చేయాలి. MP3/Music ఆప్షన్‌ని చెక్‌ చేసి Download and Convertపై క్లిక్‌ చేస్తే సరి! ఎంపీ3గా మారిపోయాక వీడియో ఫైల్‌ అక్కర్లేదనుకుంటే Delete video after convertingఎంచుకుంటే సరి. http://goo.gl/f43jv
మరో రెండు
ఒకే క్లిక్కుతో యూట్యూబ్‌ వీడియోలు పీసీలోకి రావాలనుకుంటే Rylstim Youtube Downloader టూల్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. లింక్‌ని పేస్ట్‌ చేసి Getపై క్లిక్‌ చేయగానే అందుబాటులో ఉన్న వీడియో ఫైల్స్‌ కనిపిస్తాయి. ఎక్కువ మెమొరీతో కూడిన యూట్యూబ్‌ సినిమాల్ని ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. http://goo.gl/bcNC4* ఇన్‌స్టలేషన్‌ ప్రాసెస్‌ లేకుండా EXE ఫైల్‌తోనే వీడియోలను పొందాలంటే Youtube Portable Downloaderను పొందండి. బాక్స్‌లో లింక్‌ని ఎంటర్‌ చేసి Find చేయాలి. తర్వాత డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయాలి. http://goo.gl/MroNy
అది వాడితే!
మ్యాక్‌ వాడుతుంటే Get Tubeతో యూట్యూబ్‌ వీడియోలను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.www.svcreation.fr* వీడియోలను డౌన్‌లోడ్‌ చేసేప్పుడే మొబైల్‌, ఐప్యాడ్‌, ఐఫోన్‌, ఐపాడ్‌... ఫార్మెట్‌లోకి కన్వర్ట్‌ చేసి పొందాలనుకుంటే AvioSoft Youtube Downloaderఇన్‌స్టాల్‌ చేయండి. http://goo.gl/SVOT6* డౌన్‌లోడ్‌ చేసిన వాటిని కావాల్సిన ఫార్మెట్‌లోకి మార్చుకోవాలంటే ఉచిత కన్వర్టర్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో సులువైనదే 'పజేరా వీడియో కన్వర్టర్‌'. AVI, MPEG, MP4, MOV, 3GP...ఫార్మెట్‌లోకి మార్చుకోవచ్చు. ఇంచుమించు అన్ని వీడియో ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. http://goo.gl/9eEwu*ఇలాంటిదే మరోటి Winx Video Converter. సుమారు 130 వీడియో ఫార్మెట్స్‌ని సపోర్ట్‌ చేస్తుంది.
http://goo.gl/G62UB

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు