Eenadu Salads_1


ఆల్మండ్‌ స్ట్రాబెర్రీ యాపిల్‌ సలాడ్‌
కావల్సినవి: పాలకూర ఆకులు - మూడుకప్పులు, లెట్యూస్‌ ఆకులు - కప్పు, తాజా స్ట్రాబెర్రీలు - అరకప్పు, వేయించి స్త్లెసుల్లా తరిగిన బాదం - పావుకప్పు, యాపిల్‌ ముక్కలు - కప్పు, సిడార్‌ వెనిగర్‌ - టేబుల్‌స్పూను, తేనె - టేబుల్‌స్పూను, పంచదార - ఒకటిన్నర చెంచా, ఉప్పు, మిరియాలపొడి - రుచికి సరిపడా, మరమరాలు - రెండు టేబుల్‌ స్పూన్లు.తయారీ: సిడార్‌ వెనిగర్‌, తేనె, పంచదార, ఉప్పు, మిరియాల పొడితో సలాడ్‌డ్రెసింగ్‌ సిద్ధంచేసుకోవాలి. పాలకూర, లెట్యూస్‌ ఆకులు, స్ట్రాబెర్రీలు, బాదం, యాపిల్‌ముక్కలు అన్నింటినీ బాగా కలిపి పైన డ్రెసింగ్‌వేయాలి. మరమరాలు అలంకరిస్తే పసందైన సలాడ్‌ తినడమే ఆలస్యం.



మలేషియన్‌ ఫ్రూట్‌ అండ్‌ వెజిటబుల్‌ సలాడ్‌
కావల్సినవిపైనాపిల్‌ - చిన్నది (ముక్కల్లా కోసుకోవాలి), మామిడికాయ - చిన్నది (చెక్కు తీసి స్త్లెసుల్లా తరగాలి), , కీరదోస - ఒకటి (పలుచని స్త్లెసుల్లా కోయాలి), క్యారెట్‌ - ఒకటి (సన్నగా పొడుగ్గా కోసుకోవాలి).డ్రెసింగ్‌కోసం: వెలుల్లి రెబ్బలు - రెండు, ఎండుమిర్చి చిన్నవి - రెండు, సన్నగా తరిగిన కొబ్బరిముక్కలు -ంతపండు 75 గ్రా, చి రసం - టేబుల్‌స్పూను, పంచదార - టేబుల్‌స్పూను, ఉప్పు - తగినంత, ష్రింప్‌ పేస్టు - చెంచా( ఇది బజార్లో లభిస్తుంది).
తయారీ: వెడల్పాటి పాత్రలో పైనాపిల్‌, మామిడికాయ, కీరదోస, క్యారెట్‌ ముక్కల్ని సర్దిపెట్టుకోవాలి. ముందుగా ష్రింప్‌పేస్టును అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి నిమిషం పాటు వేడిచేయాలి. ఆ తరవాత డ్రెసింగ్‌కోసం సిద్ధంచేసుకున్న పదార్థాలన్నింటినీ మెత్తని మిశ్రమంలా చేసుకుని సలాడ్‌ముక్కలపై వేసి బాగా కలిపితే సరిపోతుంది.



వెుక్కజొన్నతో మజా మజా
కార్న్‌ సలాడ్‌
కావలసినవి
వెుక్కజొన్నగింజలు: కప్పు, కీరాదోస: 2(సన్నగా తరగాలి), టొమాటోలు: 2(సన్నగా తరగాలి), క్యాబేజి తురుము: కప్పు, క్యాప్సికమ్‌: ఒకటి (సన్నగా తరగాలి), కొబ్బరి తురుము: కప్పు, నిమ్మకాయ: ఒకటి, మిరియాల పొడి: చిటికెడు, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
ఓ గిన్నెలో వెుక్కజొన్నగింజలూ కూరగాయముక్కలన్నీ వేసి బాగా కలపాలి.
తరిగిన కొబ్బరి, మిరియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపితే... అదే కార్న్‌ సలాడ్‌!

సూప్‌
కావలసినవి
వెుక్కజొన్న కండెలు(పెద్దవి): ఆరు, నీళ్లు: ఆరు కప్పులు, వెుక్కజొన్న పిండి: 2 టేబుల్‌స్పూన్లు, పంచదార: రెండు టేబుల్‌స్పూన్లు, సోయా సాస్‌: టీస్పూను, చిల్లీ సాస్‌: టీస్పూను, వెనిగర్‌: టీస్పూను, ఉప్పు: తగినంతతయారుచేసే విధానం
వెుక్కజొన్న కండెల్ని ఒలిచి గింజల్ని కుక్కర్‌లో ఉడికించాలి. ఇందులో పావుకప్పు గింజల్ని విడిగా తీసి పెట్టాలి.
మిగిలినవాటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి నీళ్లు కలిపి తక్కువ మంటమీద మరిగించాలి. తరవాత 4 టేబుల్‌స్పూన్ల నీళ్లు పోసి కలిపిన కార్న్‌ఫ్లోర్‌ మిశ్రమాన్ని మరుగుతోన్న సూప్‌లో పోయాలి. సూప్‌ చిక్కబడుతుండగా అడుగంటకుండా గరిటెతో కలుపుతూనే ఉండాలి. బాగా చిక్కబడిందనుకున్న తరవాత పంచదార, ఉప్పు, సోయా సాస్‌, చిల్లీ సాస్‌, వెనిగర్‌ కూడా కలిపితే వేడి సూప్‌ తయార్‌!

పాయసం
కావలసినవి
పాలు: లీటరు, వెుక్కజొన్నగింజలు: పెద్ద కప్పు, పంచదార: 200గ్రా||, యాలకులు: టీస్పూను, బాదంపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, పిస్తాపప్పు: రెండు, గులాబీరేకులు: కొన్నితయారుచేసే విధానం
పాలలో పంచదార కలిపి తక్కువ మంటమీద సగమయ్యేవరకూ మరిగించాలి. ఓ బాణలిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాగాక వెుక్కజొన్న గింజలు వేయించాలి. తరవాత వీటిని మరిగించిన పాలలో వేసి పాయసంలా చిక్కబడేవరకూ ఉడికించాలి. దించేముందు కొద్దిగా యాలకుల పొడి వేసి బాదం, పిస్తా పప్పులతోనూ గులాబీ రేకులతోనూ అలంకరిస్తే సరి.

ఎంపనాడ్స్‌
కావలసినవి
పిండికోసం
వరిపిండి: అరకప్పు, వెుక్కజొన్న పిండి: 2 కప్పులు, ఉప్పు: అరటీస్పూను, గోరువెచ్చని నీళ్లు: ఒకటింపావు కప్పు
ఎంపనాడ్స్‌లో పెట్టే కూరకోసం: వెుక్కజొన్నలు: ఒకటిన్నర కప్పులు, బంగాళాదుంపలు: రెండు(తొక్కతీసి చిన్న ముక్కలుగా కోయాలి), వెల్లుల్లిరేకలు: రెండు, ఉల్లిపాయ: ఒకటి (సన్న ముక్కలుగా కోయాలి), కారం: ముప్పావుటీస్పూను, ఉప్పు: టీస్పూను, మిరియాల పొడి: ముప్పావుటీస్పూను, టొమాటో గుజ్జు: 4 టేబుల్‌స్పూన్లు, కొత్తిమీర తురుము: 3 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం
చపాతీ కోసం...
ఓ గిన్నెలో వెుక్కజొన్న పిండి, వరిపిండి, ఉప్పు వేసి గోరువెచ్చని నీళ్లతో చపాతీ పిండిలా కలిపి అరగంటసేపు బట్టతో కప్పాలి.
ఎంపనాడ్స్‌లో పెట్టే కూర...
ప్రెషర్‌కుక్కర్‌లో నూనె వేసి కాగాక వెల్లుల్లి వేసి నిమిషంపాటు వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తరవాత వెుక్కజొన్న, బంగాళాదుంప ముక్కలు, కారం, ఉప్పు, మిరియాల పొడి, టొమాటో గుజ్జువేసి బాగా కలిపి మూతపెట్టి ఓ కూత రానివ్వాలి. మరో మూడు నిమిషాలు తక్కువ మంటమీద ఉడికించాలి. కుక్కర్‌ మూత వచ్చిన తరవాత అందులోనే కొత్తిమీర కూడా వేసి కలపి పక్కన బెట్టాలి.
ఎంపనాడ్స్‌ కోసం...
పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి.
వీటిని చపాతీల్లా వత్తి, వండిన కూరని ఒకటిన్నర నుంచి రెండు టీస్పూన్లు వేసి అంచుల దగ్గర కొద్దిగా తడి చేసి కజ్జికాయల్ని మడిచినట్లుగా మడవాలి.
ఇలా అన్నింటినీ చేసి పెట్టుకుని కళాయిలో నూనె పోసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించాలి. వీటిని వేడివేడిగా టొమాటోసాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.




ఓక్రా అండ్‌ చిక్‌పీ సలాడ్‌
కావలసినవి
బెండకాయలు: 100గ్రా||, కాబూలీ సెనగలు: 200గ్రా||, ఉల్లిపాయ: ఒకటి(సన్నని ముక్కలుగా తరగాలి), టొమాటోలు: నాలుగు, నిమ్మరసం: టీస్పూను, టొమాటో కెచప్‌: టేబుల్‌స్పూను, చాట్‌మసాలా: టీస్పూను, కారం: అరటీస్పూను, జీలకర్రపొడి: అరటీస్పూను, కొత్తిమీర తురుము: పావు కప్పు, అలంకరణకోసం: టీస్పూను సలాడ్‌ నూనె, పైనాపిల్‌ ముక్కలు, ముల్లంగిపూలు, టొమాటోపూలు, కొత్తిమీర
తయారుచేసే విధానం
కాబూలీ సెనగల్ని ఉడికించి ఉంచాలి.
* బెండకాయల్ని ముక్కలుగా కోసి నూనెలో వేయించి తీయాలి. వీటిని ఓ పాత్రలో వేసి, అందులో ఉడికించిన సెనగలు, మిగిలిన కూరగాయ ముక్కలు, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఓ ఐదు నిమిషాలు కదపకుండా ఉంచాలి.
* తరవాత టొమాటో కెచప్‌, చాట్‌ మసాలా, కారం, నూనె, జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలపాలి.
* చివరగా వీటిని పైనాపిల్‌, టొమాటో, ముల్లంగి పూలు, కొత్తిమీరతో అందంగా అలంకరిస్తే ఓక్రా సలాడ్‌ రెడీ!

మిక్స్‌డ్‌ షేక్‌
కావలసినవి
కొబ్బరినీళ్లు: పావుకప్పు, పేషన్‌ఫ్రూట్‌రసం: పావుకప్పు, పాలు: అరకప్పు, వెనీలా ఐస్‌క్రీమ్‌: అరకప్పు, పైనాపిల్‌ జ్యూస్‌: అరకప్పు
తయారుచేసే విధానం
కొబ్బరినీళ్లు, పండ్లరసం (పేషన్‌ ఫ్రూట్‌ లేని పక్షంలో కమలారసం కలుపుకోవచ్చు), పాలు, ఐస్‌క్రీమ్‌ అన్నింటినీ బ్లెండర్‌లో వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టండి. లేదా ఐస్‌క్యూబ్స్‌ వేసి చల్లచల్లగా అతిథులకు అందించండి. గ్లాసు అంచులకు ఓ చిన్న అరటిపండు ముక్కను అలంకరించి ఇవ్వండి.

తహిరి
(వెజ్‌ బిర్యానీ)
కావలసినవి
బాస్మతిబియ్యం: అరకిలో, బఠాణీలు: 100గ్రా||, బంగాళాదుంపలు(పెద్దవి): రెండు, వంకాయలు: 2, కాలీఫ్లవర్‌: 150 గ్రాములు(పెద్దపెద్ద రెమ్మలుగా విడదీయాలి), ఉల్లిపాయలు: మూడు, అల్లంవెల్లుల్లిముద్ద: టీస్పూను, పచ్చిమిర్చి: ఆరు, పసుపు: పావుటీ స్పూను, షాజీరా: అరటీస్పూను, లవంగాలు: నాలుగు, యాలకులు: 2, పెరుగు: అరకప్పు, కొత్తిమీర తురుము: కొద్దిగా, పుదీనా: కొద్దిగా, పచ్చిమిర్చి: మూడు, నూనె: సరిపడా, నిమ్మకాయలు: రెండు, ఉప్పు: తగినంత, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు,
తయారుచేసే విధానం
* బాస్మతి బియ్యం మూడువంతులు ఉడికించి పక్కన ఉంచాలి.
* బాణలిలో తగినంత నూనె వేసి కాగాక కూరగాయ ముక్కల్ని విడివిడిగా సగం సగం మగ్గేలా వేయించి తీయాలి. తరవాత షాజీరా, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి గోధుమరంగులోకి మారేవరకూ వేయించాలి. ఇప్పుడు, అల్లంవెల్లుల్లి, ఉప్పు, పచ్చిమిర్చి ముద్ద, పసుపు వేసి కొద్దిగా వేయించాలి.
* వేయించి ఉంచిన కూరగాయ ముక్కలన్నీ వేసి పెరుగు వేసి పది నిమిషాలు ఉడికించాలి.
* వెడల్పాటి కుక్కర్‌ తీసుకుని అందులో అడుగున నూనె వేసి కాగాక ఉడికించిన అన్నంలో సగం తీసి అడుగున పరచాలి. దానిమీద వేయించిన కూరగాయల మిశ్రమాన్ని వేసి నెయ్యి చల్లి మిగిలిన అన్నాన్ని ముక్కలమీద పరచాలి. అన్నంపైన కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనాతో అలంకరించి, నిమ్మరసం పిండి(నిమ్మరసం ఇష్టం లేకపోతే మానేయవచ్చు) మూతపెట్టి తక్కువ మంటమీద అన్నం పూర్తిగా ఉడికేవరకూ ఉంచి దించాలి.


బెండకాయతో...
మజ్జిగపులుసు
కావలసినవి
బెండకాయలు: పావుకిలో, పెరుగు: లీటరు, పెసరపప్పు: 50గ్రా. కొబ్బరి: పావుచెక్క, పచ్చిమిర్చి: 5, జీలకర్ర: అరటీస్పూను, పసుపు: పావు టీస్పూను, నూనె: 2 టీస్పూన్లు, కరివేపాకు: కప్పు, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, పోపుకోసం: ఆవాలు: అరటీస్పూను, మెంతులు: పావుటీస్పూను, జీలకర్ర: అరటీస్పూను, ఎండుమిర్చి: ఒకటి
తయారుచేసే విధానం
పెసరపప్పుని నానబెట్టి మెత్తగా రుబ్బాలి. ఓ గిన్నెలో మజ్జిగ తీసుకుని రుబ్బిన పెసరపిండిని కలిపి ఉడికించాలి. కాస్త పసుపు, కరివేపాకు కలపాలి.కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర కలిపి ముద్దగా నూరి వెయ్యాలి.
బెండకాయల్ని ముక్కలుగా కోసి నూనెలో వేయించాలి. వీటిని ఉడుకుతున్న మజ్జిగపులుసులో చేర్చి తగినంత ఉప్పు, కొత్తిమీర కలిపి తాలింపుచేయాలి.
టొమాటో ఓక్రా సూప్‌
కావలసినవి
బెండకాయలు: పావుకిలో, టొమాటోలు: అరకిలో, నూనె: వేయించడానికి సరిపడా, బియ్యం: టేబుల్‌స్పూను, మిరియాలపొడి: అరటీస్పూను, ఉప్పు: తగినంత, వెజిటబుల్‌స్టాక్‌: అరలీటరు(ముప్పావు లీటరు నీళ్లలో కప్పు క్యారెట్‌ముక్కలు, అరకప్పు ఉల్లిముక్కలు, అర అంగుళం దాల్చినచెక్క, టీస్పూను మిరియాలు, పలావు ఆకు, కాస్త కొత్తిమీర వేసి గంటసేపు సన్నని మంటమీద మరిగించాలి.)
తయారుచేసే విధానం
బెండకాయల్ని సన్నని చక్రాలుగా కోసి నూనెలో వేయించి తీయాలి.
వెజిటబుల్‌స్టాక్‌ను మరిగించాలి. అందులో మెత్తగా గ్రైండ్‌ చేసిన టొమాటో గుజ్జును వేసి మరిగించాలి.
బియ్యం దోరగా వేయించి పొడిచేయాలి. ఈ పొడిని మరిగించిన సూప్‌లో కలిపి చిక్కబడేవరకూ ఉడికించాలి.
దించేముందు ఉప్పు, మిరియాలపొడి వేసి వేయించి ఉంచిన బెండకాయముక్కల్ని కలిపి వేడిగా వడ్డించాలి.
కడాయి బేండీ
కావలసినవి
బెండకాయలు: అరకిలో, టొమాటో: పావుకిలో, ఉల్లిపాయలు: రెండు, అల్లంవెల్లుల్లి: 2 టీస్పూన్లు, జీలకర్ర: ఒకటిన్నర టీస్పూన్లు, ఎండుమిర్చి: 7, దనియాలు: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా, గరంమసాలా: పావుటీస్పూను, కసూరి మెంతికూర: టీస్పూను, జీడిపప్పు: 25గ్రా., ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
బెండకాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి ఒకటిన్నర అంగుళాల పొడవు ముక్కలుగా కోయాలి.
ఐదు ఎండుమిర్చి, దనియాలు కలిపి వేయించి పొడి చేయాలి.
ఒక బాణలిలో నూనె వేసి కాగాక బెండకాయ ముక్కల్ని డీప్‌ ఫ్రై చేసి తీయాలి. రెండు టీస్పూన్ల నూనె మాత్రం ఉంచి మిగిలింది తీసేయాలి. తరవాత అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర, మిగిలిన ఎండుమిర్చి వేసి వేయించాలి. తరవాత టొమాటోలను సన్నగా తరిగి వేయించాలి.
గరంమసాలా, దనియాలపొడి కూడా వేసి వేయించిన బెండకాయ ముక్కలు కూడా వేసి కలపాలి. చివరగా కసూరి మెంతికూరను చల్లి దించాలి.
ఓక్రా సలాడ్‌
కావలసినవి
లేత బెండకాయలు: పావుకిలో, కోడిగుడ్డు: ఒకటి, సలాడ్‌ ఆయిల్‌ లేదా ఆలివ్‌ నూనె: 100 మి.లీ., ఆవపొడి: చిటికెడు, పంచదార: పావుటీస్పూను, మిరియాలపొడి: పావుటీస్పూను, నిమ్మరసం: టీస్పూను, పాలక్రీం: పావుకప్పు, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
స్టవ్‌ మీద నీళ్లు పెట్టి మరిగించాలి. లేత బెండకాయలను ముచ్చిక కోసి ఉప్పు వేసి మరిగించిన నీళ్లలో వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
తరవాత నీళ్లు వంపేసి చల్లని మంచినీళ్లతో రెండుసార్లు కడిగితే బెండకాయలు రంగు మారకుండా ఆకుపచ్చరంగులోనే తాజాగా కనిపిస్తాయి. కాస్త ఉడికీఉడకనట్లుగా ఉండే వీటిని కొరికితే కరకరలాడుతూ ఉంటాయి. ఇప్పుడు వీటిని ఏటవాలు ముక్కలుగా కోసి ప్లేటులో అమర్చాలి. వీటిపైన మెయెునెజ్‌ క్రీమ్‌తో అలంకరించి వడ్డించాలి.
మెయెునెజ్‌ తయారీ: ఓ చిన్న గిన్నెలో గుడ్డు పగలగొట్టి తెల్లసొనను తీసేసి పచ్చసొన మాత్రమే ఉంచాలి. అందులో పంచదార, ఆవపొడి, ఉప్పు, మిరియాలపొడి, పాలక్రీం వేసి బాగా గిలకొట్టాలి. తరవాత నూనెను కొంచెం కొంచెం పోసి బాగా తిప్పాలి. నూనె అంతా గుడ్డుసొనలో ఇంకిపోయేలా కలిపితే సాస్‌లా తయారవుతుంది. చివరగా ఈ సాస్‌లో నిమ్మరసం కలిపితే అదే మెయెునెజ్‌.
















కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు