'విశ్వ'నాథుడే (Special page)
చా న్నాళ్ల కిందటి మాట. ఆనంద్ వందల కొద్దీ చెస్ పుస్తకాల్ని చదివేశాడనీ, లక్షల కొద్దీ గేమ్‌లను విశ్లేషించి, రాటుదేలాడని తెలుసుకున్న ఓ విలేకరి అతనికి పరీక్ష పెట్టాలనుకున్నాడు. కొన్ని చెస్ గేమ్‌లకు సంబంధించిన చిత్రాల్ని తీసుకుని.. ఓ విందులో ఆనంద్‌ను కలిశాడు. ఓ ఫొటో తీసి ఆనంద్ ముందు పెట్టాడు. రెండు సెకన్లు గడిచాయి. ''అది 1982లో లాస్కర్ చేసిన పరిశోధన కదూ'' ..ఆనంద్ నుంచి సమాధానం. ఇంకో చిత్రం చూపించాడు.. రెండు సెకన్ల మౌనం.. ''1962లో ఫిషర్-నాజ్‌డార్ఫ్ గేమ్ అది..'' అంటూ గేమ్ గురించి చెప్పుకుంటూ పోతున్నాడు ఆనంద్. విలేకరి ఇంకో చిత్రం చూపించాడు. ఈసారి వెంటనే సమాధానం.. ''1994లో నేను కామ్‌స్కీతో ఆడిన గేమ్'' అని. ఆనంద్ జ్ఞాపకశక్తి గురించి చెప్పడానికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచినపుడో.. లేదా మరేదైనా టోర్నీలో నెగ్గినపుడో మాత్రం మనం ఆనంద్ గురించి నాలుగు ముక్కలు చెప్పుకుంటాం.. గేమ్‌లో భలేగా ఎత్తులు వేశాడంటూ మాట్లాడుకుంటాం! కానీ ఓ గేమ్‌కు ముందు, ఓ టోర్నీకి ముందు ఆనంద్ ఎంత శ్రమిస్తాడో.. ఎంతగా బుర్రకు పనిపెడతాడో తెలుసుకుంట...