సైన్స్ విద్యార్థులకు కేవీపీవై ఫెలోషిప్‌లు
* స్ట్రీమ్ ఎస్‌ఏ: 2012-13లో ఇంటర్ మొదటి సంవత్సరం / +1 తరగతిలో ప్రవేశించనున్న విద్యార్థులు అర్హులు.
* స్ట్రీమ్ ఎస్‌ఎక్స్: 2012-13లో ఇంటర్ / +2 పూర్తిచేసుకొని 2013-14లో బీఎస్సీ / బీఎస్ / ఇంటెగ్రేటెడ్ ఎం.ఎస్‌సి.లో చేరదలచుకున్నవారు అర్హులు.
* స్ట్రీమ్ బి: 2012-13లో బీఎస్సీ/ బీఎస్/ ఇంటెగ్రేటెడ్ ఎం.ఎస్‌సి.లో చేరిన విద్యార్థులు అర్హులు.
ఎంపికైన వారికి నెలకు రూ.4000 నుంచి రూ.7000 వరకు ఫెలోషిప్ లభిస్తుంది. ఐఐఎస్‌సి, బెంగళూరు ఈ ఫెలోషిప్‌లకు సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటించనుంది. విద్యార్థులను సైన్సెస్‌లో ఉన్నత విద్య వైపు ఆకర్షించడం ఈ ఫెలోషిప్‌ల ప్రధాన లక్ష్యం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి