పరిశోధనలకు... ఏసీఎస్‌ఐఆర్
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనల వైపు యువతను ఆకర్షించడానికి పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థ అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రిసెర్చ్ (ఏసీఎస్‌ఐఆర్). ప్రధాన స్రవంతి యూనివర్సిటీలు అందించే సబ్జెక్టులకు భిన్నమైన ప్రత్యేక అంశాల్లో పరిశోధనలు నిర్వహించడం ఏసీఎస్‌ఐఆర్ లక్ష్యం. దీని ద్వారా సీఎస్‌ఐఆర్ పరిధిలోని ల్యాబొరేటరీల్లో సైన్సెస్, ఇంజినీరింగ్ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ చేసే అవకాశం లభిస్తుంది.సీఎస్‌ఐఆర్ పరిధిలో దేశవ్యాప్తంగా 37 ప్రయోగశాలలు ఉన్నాయి. బయోలాజికల్, కెమికల్, ఫిజికల్, మెడికల్ సైన్సెస్, తదితర అధ్యయన అంశాల్లో ఈ సంస్థలు ఉన్నత స్థాయి పరిశోధనలను నిర్వహిస్తున్నాయి. ఆధునిక ప్రయోగశాలలు, అంతర్జాతీయ, జాతీయ స్థాయుల్లో పేరు ప్రఖ్యాతులు గల శాస్త్రవేత్తలు ఈ సంస్థల్లో పరిశోధనలు నిర్వహిస్తుంటారు. వీరి పర్యవేక్షణలో పీహెచ్‌డీ చేయడానికి ఏసీఎస్‌ఐఆర్ అవకాశం కల్పిస్తుంది.
సీఎస్‌ఐఆర్ పరిధిలోని సంస్థలన్నీ ఏసీఎస్‌ఐఆర్ నిబంధనల ప్రకారం అభ్యర్థులకు పరిశోధనా సౌకర్యాలు కల్పిస్తాయి. అభ్యర్థులకు ఆయా సంస్థలు నిర్దేశించే అర్హతలు కూడా అవసరం. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదా ఈ రెండింటి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సీఎస్‌ఐఆర్ సంస్థలన్నీ వరుసగా నోటిఫికేషన్‌లు విడుదల చేస్తున్నాయి. ఏసీఎస్‌ఐఆర్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ఏదైనా నిర్దిష్ఠ సంస్థలో చేరాలనుకుంటే, ఆయా సంస్థలు ప్రకటించే నోటిఫికేషన్‌లకు స్పందిస్తూ కూడా దరఖాస్తు చేయవచ్చు. కొన్ని సంస్థలు ఏసీఎస్‌ఐఆర్‌తోపాటు ఆయా సంస్థల వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేయాలని కోరుతున్నాయి.
కోర్సుల వివరాలు...
* పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఇన్ సైన్సెస్: ఇంజినీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు బయోలాజికల్, కెమికల్, ఫిజికల్, మేథమేటికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేయడానికి అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్ లేదా మాస్టర్స్ డిగ్రీతోపాటు శాస్త్ర పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారు కూడా అర్హులు.
* పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఇన్ సైన్సెస్: ఇంజినీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులకు బయోలాజికల్, కెమికల్, ఫిజికల్, మేథమేటికల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేయడానికి అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్ లేదా మాస్టర్స్ డిగ్రీతోపాటు శాస్త్ర పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారు కూడా అర్హులు.
* పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ఇన్ ఇంజినీరింగ్: ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ చేసినవారు అర్హులు. గేట్ స్కోరు లేదా సీఎస్‌ఐఆర్ / యూజీసీ నెట్/ ఎన్‌బీహెచ్‌ఎం లేదా వీటికి సమాన పరీక్షల ఆధారంగా మాస్టర్స్ డిగ్రీలో చేరి ఉండాలి. ఇంజినీరింగ్ / టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు మంచి అకడమిక్ రికార్డు, గేట్ స్కోరు, పరిశోధనలపై ఆసక్తి గల అభ్యర్థులు ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేయవచ్చు. మెకట్రానిక్స్, కాంపోజిట్స్, సెన్సార్స్ అండ్ మైక్రో సిస్టమ్స్, ప్లాస్మోనిక్స్, అప్లయిడ్ మేథమేటికల్ / కంప్యూటేషనల్ మోడలింగ్, ఏరోస్పేస్, డిజాస్టర్ మిటిగేషన్, లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, తదితర అంశాల్లో పరిశోధనలు చేయవచ్చు.
* ఇంటెగ్రేటెడ్ ఎం.టెక్. - పీహెచ్‌డీ ఇన్ ఇంజినీరింగ్: ఇది ప్రతిపాదన దశలో ఉంది. దీని వ్యవధి ఐదేళ్లు. రెండేళ్ల ఎం.టెక్. పూర్తిచేసిన వారిలో 120 మందికి ఏసీఎస్‌ఐఆర్ పీహెచ్‌డీ ఇంజినీరింగ్‌లో ప్రవేశం కల్పిస్తుంది.
అభ్యర్థులు సీఎస్‌ఐఆర్, యూజీసీ, డీబీటీ, డీఎస్‌టీ, ఇన్‌స్పైర్, తదితర సంస్థలు నిర్వహించే జేఆర్‌ఎఫ్ / ఎస్‌ఆర్‌ఎఫ్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజినీరింగ్ అభ్యర్థులకు గేట్‌లో మంచి స్కోరు అవసరం. సీట్ల సంఖ్యను సంబంధిత సీఎస్‌ఐఆర్ సంస్థలు నిర్ణయిస్తాయి. ఎంపికైన అభ్యర్థులకు వారు ఉత్తీర్ణులైన ఫెలోషిప్ పరీక్ష నిబంధలను అనుసరించి ఫెలోషిప్ లభిస్తుంది. కొన్ని సంస్థల ప్రవేశ నిబంధనల్లో తేడాలు ఉండొచ్చు. అందువల్ల దరఖాస్తు చేసేముందు ఆయా సంస్థల వెబ్‌సైట్లలో వివరాలను పరిశీలించడం మంచిది. ఏసీఎస్‌ఐఆర్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ సబ్జెక్టును బట్టి గరిష్ఠంగా మూడు సంస్థలను ఎంచుకోవచ్చు.
ఐఐసీటీలో పీహెచ్‌డీ
కెమికల్ సైన్సెస్‌లో పరిశోధనలకు ప్రముఖ సంస్థ ఐఐసీటీ (హైదరాబాద్) పీహెచ్‌డీలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏసీఎస్‌ఐఆర్‌తోపాటు ఐఐసీటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. మొత్తం సీట్లు 60 ఉన్నాయి. అభ్యర్థులకు ఎం.ఎస్‌సి.లో కనీసం 60 శాతం మార్కులు అవసరం. ఏసీఎస్‌ఐఆర్ - ఐఐసీటీ పీహెచ్‌డీలో ప్రవేశానికి నెట్ లేదా గేట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ సంస్థలో కెమికల్, బయోలాజికల్, కెమికల్ ఇంజినీరింగ్ అధ్యయన అంశాల్లో పరిశోధనలు చేయవచ్చు.
కెమికల్ సైన్సెస్‌లో పరిశోధనలకు ప్రముఖ సంస్థ ఐఐసీటీ (హైదరాబాద్) పీహెచ్‌డీలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏసీఎస్‌ఐఆర్‌తోపాటు ఐఐసీటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. మొత్తం సీట్లు 60 ఉన్నాయి. అభ్యర్థులకు ఎం.ఎస్‌సి.లో కనీసం 60 శాతం మార్కులు అవసరం. ఏసీఎస్‌ఐఆర్ - ఐఐసీటీ పీహెచ్‌డీలో ప్రవేశానికి నెట్ లేదా గేట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ సంస్థలో కెమికల్, బయోలాజికల్, కెమికల్ ఇంజినీరింగ్ అధ్యయన అంశాల్లో పరిశోధనలు చేయవచ్చు.
ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఐదేళ్లలోగా కోర్సు పూర్తిచేయాలి. సబ్జెక్టుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్, ఎథిక్స్, కంప్యూటేషనల్ టెక్నిక్స్, తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు.
* ఏసీఎస్‌ఐఆర్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరితేదీ: 18 మే 2012
* ఐఐసీటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 21 మే 2012.
* ఐఐసీటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 21 మే 2012.
* సెంట్రల్ బిల్డింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, రూర్కీ * సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలెక్యులర్ బయాలజీ, హైదరాబాద్* ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ * సెంట్రల్ డ్రగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, లక్నో * సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, కరైకుడి * సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, పిలానీ * సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, మైసూర్ * సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, కోల్‌కతా * సెంట్రల్ లెదర్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, చెన్నై * సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్, లక్నో * సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆప్ మైనింగ్ అండ్ ఫ్యుయల్ రిసెర్చ్, ధన్‌బాద్ * సెంటర్ ఫర్ మేథమేటికల్ మోడలింగ్ అండ్ కంప్యూటర్ సిమ్యులేషన్, బెంగళూరు * సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, న్యూఢిల్లీ * నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, లక్నో * సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్, చండీగఢ్ * ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటెగ్రేటివ్ బయాలజీ, న్యూఢిల్లీ * ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ, కోల్‌కతా * ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, డెహ్రాడూన్ * ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రిసెర్చ్, లక్నో * సెంట్రల్ సాల్డ్ అండ్ మెరైన్ కెమికల్స్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, భావ్‌నగర్ * ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ, పాలంపూర్ * నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ, పుణె * ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ, చండీగఢ్ * నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్, హైదరాబాద్ * నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, న్యూఢిల్లీ * నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, న్యూఢిల్లీ * ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటెగ్రేటివ్ మెడిసిన్, జమ్ము |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి