సమాజ హితమే లక్ష్యం! అవార్డులే సాక్ష్యం! (Eenadu etaram 26/05/2012)
సమయం దొరికితే సరదాల ఒడిలోకి జారుకోవడం... కాలేజీ కుర్రకారుకు సాధారణం... దీనికి భిన్నంగా... సమాజానికి ఉపయోగపడుతోందో విద్యార్థి బృందం... ఉద్యోగం రాగానే సొంతానికి ఆలోచించడం సహజం... అందుకు భిన్నంగా సమాజ హితానికి ప్రయోగాలు చేశాడో యువకుడు... వీరి సదాశయం, సమాజ కాంక్ష వూరికే పోలేదు. అంతర్జాతీయ అవార్డులందాయి! ఆ విజయగాథని 'ఈతరం'తో పంచుకున్నారిలా...పచ్చదనానికి వూతం! అంతర్జాతీయ పోటీ. బరిలో యాభై ఒక్క దేశాలు. మూడు వందల విశ్వవిద్యాలయాలు. నెలలో ఎవరు ఎక్కువ పచ్చదనం పెంపొందించే కార్యక్రమాలు చేపడితే వాళ్లే విజేతలు. కలసికట్టుగా అడుగేశారు పెరంబదూరులోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు.విజయలక్ష్మి వరించింది. అంతర్జాతీయ అవార్డు అందింది.
- రుద్రరాజు సుభాష్, న్యూస్‌టుడే: తమిళనాడు డెస్క్
|
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి