స్మార్ట్ మొబైల్... చదివించే పుస్తకం! (17/05/2012)
గూగుల్ ఉచితంగా అందించే ఈ-పుస్తకాల్ని మొబైల్‌లో చదవాలంటే Google Play Books అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరి. ఆండ్రాయిడ్ యూజర్లు స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పేరుతో పుస్తకాలను వెతుక్కోవచ్చు. పుస్తకాలన్నీ కవర్ పేజీలతో జాబితాగా కనిపిస్తాయి. కావాల్సిన వాటిని ఎంచుకోగానే తాకే తెర తెరచిన పుస్తకంలా మారిపోతుంది. పుస్తకంలో పేజీలు తిరగేసినట్టుగానే వేళ్లతో స్వైప్ చేస్తూ చదవొచ్చు.http://goo.gl/hDfcW అన్నీ ఉచితం! సుమారు లక్ష పుస్తకాల్ని ఉచితంగా అందిస్తోంది Wattpad.ఇది ప్రపంచంలోనే అతిపెద్ద 'రీడర్స్ అండ్ రైటర్స్' కమ్యూనిటీ. విభాగాల వారీగా పుస్తకాల్ని వెతకచ్చు. కమ్యూనిటీ సభ్యులతో అభిప్రాయాల్ని పంచుకోవచ్చు. కామెంట్స్ పోస్ట్ చేయవచ్చు కూడా. Auto Scroll, Night Mode, Offline Reading ప్రత్యేకతలు. జాబితాలోని పుస్తకాల గురించి సంక్షిప్త వివరణ, వాటిపై కమ్యూనిటీ సభ్యుల స్పందన కూడా చూడొచ్చు. http://goo.gl/v1sA9* ఇదే అప్లికేషన్‌ని బ్లాక్‌బెర్రీ యూజర్లు బ్లాక్‌బెర్రీ అప్‌వరల్డ్ నుంచి ఉచితంగా పొందొచ్చు. http://goo.gl/9DyS3* బ్లాక్‌బెర్రీ యూజర్లకు 'ఫ్రీబుక్స్' మరోటి. http://goo.gl/nVrmp వేలల్లో పుస్తకాలు మొబైల్‌లోనే స్మార్ట్ గ్రంథాలయాన్ని ఓపెన్ చేయాలంటేAldiko Book Reader అప్లికేషన్‌ను పొందాల్సిందే. యాభై లక్షల పుస్తక ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. Shelf View, Store, List View, Files రూపంలో పుస్తకాల్ని చూడొచ్చు. ఉదాహరణకు 'షెల్ఫ్ వ్యూ' ఎంచుకుంటే అరల్లో పుస్తకాలు కనిపిస్తాయి. 'స్టోర్'లోకి వెళ్లి పుస్తకాల్ని ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు. ఈ-పుస్తకాల టెక్ట్స్ సైజు పెంచుకునే వీలుంది. తెర Brightnessని కావాల్సిన మేర సెట్ చేసుకునే వీలుంది. నచ్చిన పుస్తకాల్ని బుక్‌మార్క్ చేసి పెట్టుకోవచ్చు. Library Management Systemతో పీడీఎఫ్ ఫార్మెట్‌లో పుస్తకాల్ని ఇంపోర్ట్ చేసుకునే వీలుంది. పుస్తకంలోని పదాలకు అర్థాలను అక్కడే గూగుల్ సెర్చ్‌లో వెతకొచ్చు. http://goo.gl/FaZoU 'కిండిల్' కూడా... ప్రముఖ ఈ-పుస్తకాల స్థావరం కిండిల్ స్టోర్‌ని పొదాలంటేKindle for Android అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌బిల్డ్‌గా అందిస్తున్న నిఘంటువుతో పదాలకు అర్థాల్ని తెలుసుకోవచ్చు. ఆ పదాలకు గూగుల్, వికీపీడీయా సెర్చ్ లింక్స్ కూడా కనిపిస్తాయి. ఫాంట్ సైజు, స్క్రీన్ బ్రైట్‌నెస్, బ్యాక్‌గ్రౌండ్ కలర్, ఓరియంటేషన్‌ను మార్చుకోవచ్చు. http://goo.gl/1mah1* ఐఫోన్ యూజర్లు ఐట్యూన్స్ నుంచి ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.http://goo.gl/EK1Gl వారికి ఐబుక్స్ ఐఫోన్ యూజర్లకు ప్రత్యేక స్టోర్ ఉంది. అదే iBooks. ఐట్యూన్స్ నుంచి ఉచితంగా అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. స్టోర్‌లోని పుస్తకాల్ని కొని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉచిత పుస్తకాల్ని ఆన్‌లైన్‌లోనే చదవొచ్చు. పుస్తకాల్లో బుక్‌మార్క్‌లు పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఆకట్టుకున్న పేరాగ్రాఫ్‌లకు నోట్స్ రాసుకోవచ్చు. Page Navigatorతో కావాల్సిన పేజీలోకి ఇట్టే వెళ్లొచ్చు. http://goo.gl/Y5M0c మరికొన్ని... * ఆండ్రాయిడ్ యూజర్లకు Kobo eBooks మరోటి. సుమారు 1.8 మిలియన్ల ఉచిత ఈ-బుక్స్ ఉన్నాయి. పుస్తకంలో నచ్చిన పేరాగ్రాఫ్, కొటేషన్స్‌ని ఫేస్‌బుక్‌లో షేర్ చేయవచ్చు. కామెంట్స్‌ని పోస్ట్ చేయవచ్చు.http://goo.gl/sjXin * ఆండ్రాయిడ్ యూజర్లకు మరికొన్ని... Blio eBooks-http://goo.gl/RLPdh, Orange Book Club- http://goo.gl/U9Tbo, Vampire Library- http://goo.gl/ZDhxl * బాక్‌బెర్రీ యూజర్లకు మరోటి 100 Free Books. అప్‌వరల్డ్ నుంచి ఉచితంగా పొందొచ్చు. http://goo.gl/MzWmB |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి