ట్యాబ్లెట్‌ కొన్నారా? (Eenadu Thursday Internet tips 31/05/2012)





ట్యాబ్లెట్‌... ట్యాబ్లెట్‌.. ట్యాబ్లెట్‌!ఎక్కడైనా ఇదే మాట! సొంతం చేసుకున్నారు సరే.. మరి అబ్బురపరిచే అప్లికేషన్లు తెలుసా?పైగా ఇవన్నీ ఉచితం!
నాజూకుగా చేతిలో ఒదిగిపోయే ట్యాబ్లెట్‌ చౌకగానూ అందుబాటులోకి వస్తోంది. కంపెనీలు నువ్వా, నేనా అంటూ రోజుకో మోడల్‌తో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ గురించి వేరే చెప్పాలా? అదనపు అప్లికేషన్లతో అన్నీ ప్రయోజనాలే. ఈ నేపథ్యంలో ఉచితంగా అందుబాటులో ఉన్న అప్లికేషన్లు కొన్ని...
ఇదో ఫైల్‌ మేనేజర్‌
ట్యాబ్లెట్‌లో ఫైల్స్‌ని బ్రౌజ్‌ చేయడానికి డీఫాల్ట్‌గా ఎక్స్‌ప్లోరర్‌ ఉంటుంది. మరింత సులభంగా ఫైల్స్‌, ఫోల్డర్లను బ్రౌజ్‌ చేసి చూసుకోవాలంటే File Manager ఉంటే సరి. 80 రకాల ఫైల్‌ ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. 19 భాషల్లో సెట్‌ చేసుకుని వాడుకోవచ్చు. ఫైల్స్‌ని List, Grid Viewల్లో చూడొచ్చు. ఒకటి కంటే ఎక్కువ ఎంచుకోవచ్చు. వెతుక్కుని పంచుకోవచ్చు కూడా. ముఖ్యమైన వాటికి తెరపై షార్ట్‌కట్స్‌ పెట్టుకోవచ్చు. టెక్ట్స్‌ ఎడిటర్‌, ఇమేజ్‌ గ్యాలరీ... సదుపాయాలు ఉన్నాయి. http://goo.gl/it0Jh
* ఇలాంటిదే మరోటి Open Manger. ఫైల్స్‌ని కంప్రెస్‌, ఎక్ప్‌ట్సాక్ట్‌ చేయవచ్చు. Sort పద్ధతిలో చూడొచ్చు.http://goo.gl/r8BWe
అక్కర్లేకుంటే!
వాడని టూల్స్‌ని తొలగించాలంటే Easy Uninstallerఅప్లికేషన్‌తో చిటికెలో సాధ్యం. రన్‌ చేయగానే ఇన్‌స్టాల్‌ చేసిన అన్ని టూల్స్‌ కనిపిస్తాయి. అక్కర్లేని వాటిని తొలగించవచ్చు. http://goo.gl/FCa6V
* ఇలాంటిదే మరోటి Uninstaller. మొబైల్‌, ట్యాబ్లెట్‌ల్లో పని చేస్తుంది. http://goo.gl/is7dZ
వీడియోలే... వీడియోలు!
స్ట్రీమింగ్‌లో వీడియోలను చూడాలంటే Ustreamఅనువైన మార్గం. సెర్చ్‌బాక్స్‌ ద్వారా వీడియోలను వెతకొచ్చు. నచ్చిన వాటిని సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో పంచుకోవచ్చు. http://goo.gl/9aBvM
* మరోటి Watch TV. ఇదో ఆన్‌లైన్‌ టీవీ. టీవీ డేటాబేస్‌కి అనుసంధానమై వీడియోలు చూడొచ్చు. సుమారు 100 ఛానళ్లను పొందవచ్చు. Movies, Music, Cartoons, News, Sports... విభాగాలుగా ఛానళ్లలోని వీడియోలు కనిపిస్తాయి. http://goo.gl/z8Bjc
* సుమారు 50 ఛానళ్లను అందిస్తోంది Tv Oneline Free.http://goo.gl/tnvF7
రక్షణ వలయం
ట్యాబ్‌ను ఎవరైనా దొంగిలించినా, పోయినా ప్రత్యేక సెక్యూరిటీ టూల్స్‌తో ఎక్కడున్నా పట్టేయవచ్చు. అందుకు Prey Anti-Theftఅప్లికేషన్‌ ఉంది. జీపీఎస్‌, వై-ఫైతో పని చేస్తుంది. పోగానే ఎవరికీ డేటా అందుబాటులోకి రాకుండా చేయవచ్చు. బిగ్గరగా అలారం వినిపించేలా చేయవచ్చు. మొబైల్‌ ఫోన్లలోనూ దీన్ని వాడుకోవచ్చు. http://goo.gl/g7e41
* వైరస్‌ల నుంచి ట్యాబ్‌ని కాపాడుకోవాలంటే ఏవీజీ సంస్థ ఉచితంగా అందిస్తున్న Antivirus Free వాడితే సరి. పోగొట్టుకుంటే గూగుల్‌ మ్యాప్స్‌తో ఎక్కడుందో తెలుసుకోవచ్చు. మొబైల్‌లో కూడా పని చేస్తుంది.http://goo.gl/tBlla
ముఖ్యం అనుకుంటే?
ట్యాబ్‌లో భద్రం చేసిన ముఖ్యమైన ఫైల్స్‌ని ఇతరులెవ్వరూ చూడకూడదనుకుంటే File Protectorఉంది. డాక్యుమెంట్‌లు, ఫొటోలు, మ్యూజిక్‌ ఫైల్స్‌, పర్సనల్‌ వీడియోలు, ఫోల్డర్లను పాస్‌వర్డ్‌తో లాక్‌ చేయవచ్చు. అన్ని రకాల ఫార్మెట్‌లను సపోర్ట్‌ చేస్తుంది. http://goo.gl/jNF0e
* ఫొటో, వీడియో గ్యాలరీలకు తాళం వేయాలంటేGallery Lock పొందండి. నెంబర్‌ పాస్‌వర్డ్‌తో పాటు Pattern Lock కూడా పెట్టుకునే వీలుంది. http://goo.gl/iMkWG
భలే ఆకట్టుకుంటాయి!
ఆకట్టుకునే వాల్‌పేపర్లను పెట్టుకోవాలంటే Tablet Wallpaper టూల్‌ ఉంది. వేలల్లో కనిపిస్తాయి.http://goo.gl/j8QYW
* ఇలాంటిదే మరోటి Wallpapers Bayhttp://goo.gl/AUbxF
మరికొన్ని...
* ట్యాబ్‌లోని హిస్టరీ తొలగించాలంటే History Eraserటూల్‌ని వాడండి. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల మంది వాడుతున్నారు. http://goo.gl/mkxla
* తెరపై బొమ్మలు గీయడానికి DrawFree ఉంది. నోట్స్‌ రాసుకోవచ్చు కూడా. http://goo.gl/ij3k4
* టెక్ట్స్‌ మెసేజ్‌లతో ఛాటింగ్‌ చేసుకోవాలంటే Tablet Talkఅనువైంది. జీమెయిల్‌ కాంటాక్ట్స్‌ని సింక్రనైజ్‌ చేస్తుంది. Caller ID popup, SMS నోటిఫికేషన్స్‌ని కూడా చూపిస్తుంది. http://goo.gl/DzgRA


========================================================================








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు