ఆ పదీ చాలు... అదిరే సౌకర్యాలు! (Eenadu Thursday 27/04/2012)
కొత్తగా పీసీ కొన్నారా? అవసరానికి సరిపడే సాఫ్ట్‌వేర్‌లు లేవా? వెబ్‌లో వేటాడుతున్నారా? అంత కష్టం వద్దు! ఇవిగో అద్భుతమైన 'పది' టూల్స్!! కళ్ల ముందు కనిపించేవాటిని కెమెరాతో వీడియో తీసినట్టుగా... కంప్యూటర్‌పై చేస్తున్న వర్క్‌ని వీడియో ఫైల్‌గా రికార్డ్ చేయాలనుకుంటే CAMSTUDIO గురించి తెలుసుకోవాల్సిందే. ఈ ఉచిత స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉచితంగా ఇన్‌స్టాల్ చేసుకుంటే కాలేజీ ప్రజంటేషన్‌న్నో... కంప్యూటర్ పాఠాన్నో... పీసీపై చేస్తూనే వాయిస్‌తో పాటు రికార్డ్ చేయవచ్చు. టూల్‌ని రన్ చేసి వచ్చిన విండోలోని Record బటన్‌పై నొక్కి మినిమైజ్ చేయాలి. వర్క్ పూర్తయ్యాక Stopపై క్లిక్ చేయాలి. రికార్డ్ అయిన ఫైల్ AVI ఫార్మెట్‌లో వస్తుంది. మధ్యలో రికార్డింగ్‌ని ఆపాలంటే Pause ఉంది. http://camstudio.org కొత్త ప్లేయర్ పాటలు వినాలంటే ప్లేయర్ వాడాల్సిందే. మరి, మీకుJaangleగురించి తెలుసా? ఇదో ఉచిత మ్యూజిక్ ప్లేయర్, ఆర్గనైజర్. వీడియోలను ప్లే చేసుకునేందుకు అనువుగా రూపొందించారు. ఆల్బమ్‌లను మేనేజ్ చేసేందుకు Albums, Artist విభాగాలు ఉన్నాయి. 'మౌస్ ఫ్రీ నావిగేషన్'తో మౌస్ లేకుండా షార్ట్‌కట్‌లతో పని పూర్తి చేయవచ్చు.http://goo.gl/HjfrC సమస్య ఏదైనా? సిస్టంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఏం చేయాలో తెలుసుకోవాలంటే CrossLoopలో సభ్యులైతే సరి! వెబ్‌లో అందుబాటులో ఉన్న వందలాది నిపుణుల్ని సలహాలు అడగొచ్చు. సురక్షిత పద్ధతిలో మీ కంప్యూటర్‌ని ఆన్‌లైన్‌లోనే ఇతరులకు షేరింగ్ ఇవ్వొచ్చు. అంటే మీ అనుమతితో పీసీలోకి లాగిన్ అయ్యి సమస్యని పరిష్కరిస్తారన్నమాట. వాళ్లతో ఛాట్ చేయవచ్చు కూడా. హార్డ్‌వేర్ సమస్యలే కాదు ఎమ్మెస్ ఆఫీస్, ఇంటర్నెట్, వెబ్ డిజైనింగ్... అంశాల్లో వచ్చే సందేహాల్ని కూడా తీర్చుకోవచ్చు. దీన్ని వాడేందుకు 128 ఎంబీ ర్యామ్, 2 ఎంబీ హార్డ్‌డ్రైవ్ స్పేస్ ఉండాలి. www.crossloop.com/download.htm?src=hp * మ్యాక్ యూజర్లు కూడా సాఫ్ట్‌వేర్‌ను వాడొచ్చు. డౌన్‌లోడ్ ఫైల్ కోసం http://goo.gl/r38oL ఒకే దాంట్లో నాలుగు మానిటర్‌పై నాలుగు ఖాళీ డెస్క్‌టాప్‌లను సృష్టించాలనుకుంటే Dexpot మీ కోసమే! ఇన్‌స్టాల్ చేశాక సిస్టం ట్రేలోకి చేరే ఐకాన్‌పై క్లిక్ చేస్తే వర్చువల్ డెస్క్‌టాప్‌ల లిస్ట్ కనిపిస్తుంది. ఒక్కో డెస్క్‌టాప్‌లో కావాల్సిన వాటిని ఓపెన్ చేసి వాడుకోవచ్చు. ఉదాహరణకు డెస్క్‌టాప్-1లో అప్లికేషన్ సాఫ్ట్‌వేర్‌లను ఓపెన్ చేసి వాడుకోవచ్చు. రెండులో ఇంటర్నెట్ సర్వీసుల్ని, మూడులో ప్రైవేటు బ్రౌజింగ్‌ని చేయవచ్చు. తెర పరిమాణం తక్కువగా ఉన్న ల్యాపీల్లో ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. www.dexp ot.de/index. php?id=download తిరిగి పొందలేరు పాత కంప్యూటర్ అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడో... ముఖ్యమైన ఫైల్స్‌ని ఎవ్వరూ యాక్సెస్ చేయకూడదనుకున్నప్పుడో... డేటాని ఎడిట్ చేసి వూరుకోవద్దు. Recuva లాంటి రికవరీ టూల్స్‌తో తిరిగి పొందే అవకాశాలు చాలా ఎక్కువే. శాశ్వతంగా డేటాని డ్రైవ్‌ల నుంచి తీసేయాలంటే Eraser ఉంది. ఇన్స్‌స్టాల్‌చేశాకNew Task ఆప్షన్‌తో ఫైల్స్‌ని ఎంపిక చేసుకుని Run Nowతో డిలీట్ చేయవచ్చు. మార్పులు చేయాలంటే Edit Taskఉంది. http://eraser.heidi.ie/download.php మరోటి అదనం పీసీ అంటే టాస్క్‌బార్, స్టార్ట్ బటన్, ఐకాన్లు, సిస్టం ట్రే... ఇవేనా? అదనంగా మరేదైనా టూల్‌బార్ ఉంటే? అయితేRocketDock టూల్‌ని ప్రయత్నించండి. మ్యాక్ ఓఎస్‌లో మాదిరిగా టూల్‌బార్‌ని డెస్క్‌టాప్‌పై పెట్టుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేయగానే డీఫాల్ట్‌గా తెర పైభాగంలో వస్తుంది. దాంట్లో మీరు ఎక్కువగా వాడే అప్లికేషన్స్‌ని షార్ట్‌కట్స్ రూపంలో పెట్టుకోవచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ పద్ధతిలో సులువుగా ఇన్‌సర్ట్ చేయవచ్చు. టూల్‌బార్‌పై పాయింటర్ పెట్టగానే అప్లికేషన్లు ముందుకు వస్తాయి. పాయింటర్ తీసేస్తే ఆటోమాటిక్‌గా మాయం అవుతాయి.http://rocketdock.co m/download ఇదో రక్షణ వలయం వైరస్‌ల బెడదను అడ్డుకోడానికి Comodo Cleaning Essentialsపొందాల్సిందే. స్కాన్ చేయగానే Rootkits, Hidden Files, Malicious Registry Keys, Untrusted Processలను గుర్తించి వాటి పని పడుతుంది. ఇన్‌స్టలేషన్ ప్రాసెస్ లేకపోవడంతో యూఎస్‌బీ డ్రైవ్ నుంచి కూడా దీన్ని వాడుకోవచ్చు.www.comodo.com/business-security/network-protection/cleaning_essentials.php ఇలా ఓపెన్ చేస్తే! సిస్టంలోని అప్లికేషన్స్‌ని ఓపెన్ చేయాలంటే విండోస్‌లో లొకేషన్‌లోకి వెళ్లాల్సిందే. లేదంటే 'రన్' సెలెక్ట్ చేయాల్సిందే. మరింత సులవుగా ప్రత్యేక బాక్స్‌లో పేరు టైప్ చేసి ఓపెన్ చేయాలనుకుంటే, Launchyఅప్లికేషన్‌తో సాధ్యమే. సిస్టం ట్రేలో కనిపించే గుర్తుపై రైట్‌క్లిక్ చేసి Show Launchyతో ఓపెన్ చేయాలి. వచ్చిన బాక్స్‌లో కావాల్సిన అప్లికేషన్ పేరు టైప్ చేసి ఎంటర్ కొడితే సాఫ్ట్‌వేర్ ఓపెన్ అవుతుంది. బాక్స్ ఎప్పుడూ తెరపై కనిపించేలా పెట్టుకోవాలంటే సెట్టింగ్స్‌లో మార్చుకునే వీలుంది.www.launchy.net/download.php ఫార్మెట్ ఏదైనా! మీ మెయిల్‌కి వచ్చే ఎటాచ్‌మెంట్స్, డౌన్‌లోడ్ ఫైల్స్ కొన్ని కట్టలా ప్యాక్ చేసినట్టుగా కనిపిస్తాయి. వాటిని Zip, Rar ఫైల్స్‌గా పిలుస్తారు. ఆయా ఫైల్స్‌ని సాధారణ ఫార్మెట్‌లోకి తేవాలంటే IZArc ఉండాల్సిందే. సుమారు 45 రకాల ఫార్మెట్ ఫైల్స్‌ని ఇది సాధారణ స్థితికి తెస్తుంది. అలాగే, మీరు పంపాల్సిన ఫైల్స్ అన్నిటినీ ఒక ఫోల్డర్‌లో వేసి జిప్ చేయవచ్చు కూడా. www.izarc.org భద్రం చేయాలా? కాపీ, పేస్ట్ ఆప్షన్లను వాడేప్పుడు తాజాగా కాపీ చేసింది మాత్రమే మెమొరీలో ఉంటుంది. మరి గతంలో కాపీ చేసిన టెక్ట్స్ మేటర్‌ని కూడా బ్యాక్‌అప్ చేసుకుని పొందాలంటే, ClipCube టూల్‌ని వాడితే సరి. ఇన్‌స్టాల్ చేసుకున్నాక మీరు దేన్ని కాపీ చేసినా మొత్తం టెక్ట్స్ మేటర్ వరుస క్రమంలో జాబితాగా సేవ్ అవుతుంది. విండోలోని Toggle Editorలోకి కావాల్సిన మెటర్‌ని Copy, Cutచేసుకోవచ్చు. http://clipcube.wikispaces.com * డాక్యుమెంట్ అవసరాలకు వర్డ్, ఎక్సెల్ వాడుతున్నట్లుగా వ్యక్తిగత విషయాల్ని రాసుకోవడానికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కావాలంటే RedNotebook పొందండి. క్యాలెండర్ ఆధారంగా నోట్స్ రాసుకోవచ్చు.http://rednotebook.sourceforge. net/downloads.html |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి