బిట్స్‌ పిలానీలో ఆఫ్‌ క్యాంపస్‌ ప్రోగ్రామ్‌లు


బిట్స్‌ పిలానీలో ఆఫ్‌ క్యాంపస్‌ ప్రోగ్రామ్‌లు
బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌) పిలానీ వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ఆఫ్‌ క్యాంపస్‌ పద్ధతిలో అనేక కోర్సులను అందిస్తోంది. ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, హెల్త్‌కేర్‌, తదితర రంగాల్లో పనిచేస్తున్న అభ్యర్థుల సామర్థ్యాల పెంపుదలకు, కెరియర్‌ వృద్ధికి ఈ డిగ్రీలు ఉపయోగపడతాయి.ఇంజినీరింగ్‌ విద్యకు ప్రసిద్ధిచెందిన బిట్స్‌ పిలానీ వర్క్‌ ఇంటెగ్రేటెడ్‌ లెర్నింగ్‌ ప్రోగ్రామ్స్‌ పేరుతో ఆఫ్‌ క్యాంపస్‌ కోర్సులను నిర్వహిస్తోంది. టెక్నాలజీ ఆధారంగా వర్చువల్‌ క్లాస్‌రూమ్‌ పద్ధతిలో ఈ కోర్సులు చేయవచ్చు. కోర్సులో భాగంగా అసైన్‌మెంట్లు, కేస్‌ స్టడీలు, ప్రాజెక్టులు ఉంటాయి. డిజిటల్‌ లైబ్రరీని ఉపయోగించుకోవచ్చు.
బిట్స్‌ ఆయా రంగాల్లోని ప్రముఖ సంస్థలతో కలిసి ఆఫ్‌ క్యాంపస్‌ కోర్సులను నిర్వహిస్తోంది. సీఎంసీ వెల్లూర్‌; బాంబే హాస్పిటల్‌ ముంబయి; న్యూఢిల్లీలోని కన్సల్టెన్సీ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, జైపూర్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సంబంధిత కోర్సుల నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి.
కోర్సుల వివరాలు....
బి.ఎస్‌. ఇంజినీరింగ్‌ టెక్నాలజీ: టెక్నికల్‌ డిప్లొమా / బీఎస్సీ లేదా మ్యాథ్స్‌లో మంచి పరిజ్ఞానంతోపాటు ఇంజినీరింగ్‌ పరిశ్రమలో కనీసం రెండేళ్లు అనుభవం ఉండాలి.బి.ఎస్‌. ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌: విద్యార్హతలు పై కోర్సుకు మాదిరిగానే ఉంటాయి. అభ్యర్థులకు ఐటీ పరిశ్రమలో రెండేళ్ల అనుభవం అవసరం.
ఎం.ఎస్‌. కన్సల్టెన్సీ మేనేజ్‌మెంట్‌: బిట్స్‌ అందించే ఇంటెగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ లేదా దానికి సమాన అర్హతతోపాటు కన్సల్టింగ్‌, బిజినెస్‌ ఆర్గనైజేషన్‌లో పని చేస్తుండాలి.
ఎం.ఎస్‌. మాన్యుఫ్యాక్చరింగ్‌ మేనేజ్‌మెంట్‌: బిట్స్‌ ఇంటెగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ లేదా దానికి సమాన అర్హతతోపాటు మేథ్స్‌లో పరిజ్ఞానం బాగుండాలి. మాన్యుఫ్యాక్చరింగ్‌ పరిశ్రమల్లో కనీసం ఏడాది అనుభవం అవసరం.
ఎం.ఎస్‌. సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌: విద్యార్హతలు పై కోర్సుకు మాదిరిగానే. ఐటీ పరిశ్రమల్లో కనీసం ఏడాది అనుభవం అవసరం.
ఎం.ఎస్‌. క్వాలిటీ మేనేజ్‌మెంట్‌: బిట్స్‌ అందించే ఇంటెగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ లేదా దానికి సమాన అర్హత ఉండాలి. అభ్యర్థులు క్వాలిటీ, సంబంధిత సేవల్లో పనిచేస్తుండాలి.
ఎం.ఫిల్‌. హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ మేనేజ్‌మెంట్‌: ఎంబీబీఎస్‌ లేదా బిట్స్‌ అందించే ఇంటెగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ లేదా దానికి సమాన అర్హత అవసరం. హెల్త్‌కేర్‌ రంగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. సంస్థ స్పాన్సర్‌షిప్‌ చేయాలి.
సంబంధిత పరిశ్రమల్లో పని చేస్తుండటం అన్ని కోర్సులకు చాలా ముఖ్యమైన అర్హత. అభ్యర్థి విద్యార్హతలు, వర్క్‌ ప్రొఫైల్‌, అకడమిక్‌ రికార్డు, అనుభవం, పని చేస్తున్న సంస్థ ప్రొఫైల్‌, మెంటార్‌ ప్రొఫైల్‌, తదితర అంశాల ఆధారంగా అభ్యర్థులను కోర్సులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తులను సంస్థ వెబ్‌సైట్‌ www.bits-pilani.ac.inనుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజును నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా, డీడీ లేదా చలానా రూపంలో చెల్లించవచ్చు. ఇతర వివరాలు వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
పూర్తిచేసిన దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ 8 జూన్‌ 2012

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అమెరికాయానానికి 'ఈనాడు' తోడు